Kanguva Day 6 collections : దారుణంగా కంగువా కలెక్షన్స్ .. సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ నటించిన కంగువా బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిరుత్తై శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కోలీవుడ్ బాహుబలిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం .. నెగిటివ్ టాక్, ఫేక్ పబ్లిసిటీతో తీవ్రంగా నష్టపోతోంది. అయినప్పటికీ తట్టుకుని నిలబడిన కంగువా 6వ రోజు ఏయే ఏరియాల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందో ఒకసారి చూస్తే.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా కంగువాను నిర్మించారు. క్రీస్తు శకం 1000 - 1100 శతాబ్ధాల మధ్య జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా పీరియాడికల్ మూవీగా కంగువాను రూపొందించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడని అద్బుతమైన లోకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఇండస్ట్రీలోని టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేశారు. కంగువా మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. దీనికి ప్రమోషన్స్ ఖర్చులు రూ.50 కోట్లు అదనంగా చేరాయని కోలీవుడ్ టాక్.

టీజర్, ట్రైలర్ , సూర్య, బాబీ డియోల్‌ల గెటప్ తదితర కారణాలతో కంగువా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు హక్కులు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ, ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. మొత్తంగా కంగువా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది. దీంతో సూర్య మూవీకి రూ. 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6000 స్క్రీన్లలో కంగువాను రిలీజ్ చేయగా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఐదు రోజుల్లో ఈ సినిమా తమిళనాడులో రూ. 27.35 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.35 కోట్లు, కర్ణాటకలో 4.40 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 13.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.22.35 కోట్లు చొప్పున మొత్తంగా రూ.86.80 కోట్ల గ్రాస్.. రూ. 41.70 కోట్ల షేర్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఐదు రోజుల్లో రూ. 13.35 కోట్ల గ్రాస్.. రూ.7.79 కోట్ల షేర్‌ను రాబట్టింది. నైజాంలో రూ. 3.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.09 కోట్లు, ఆంధ్రలో రూ. 3.49 కోట్లు చొప్పున కంగువా కలెక్ట్ చేసింది.

ఇక ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా కంగువా ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించిందో చూస్తే.. తమిళనాడులో రూ.1.52 కోట్లు, హిందీలో రూ. కోటి , తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.41 కోట్లు, కన్నడలో రూ. 2 లక్షలు, మలయాళంలో రూ. 2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 25 లక్షల చొప్పున మొత్తంగా రూ.4 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టింది. ఆరు రోజుల వరకు కంగువా రూ.90 కోట్ల గ్రాస్‌ను సూర్య మూవీ సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ. 140 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











