twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాంతార బడ్జెట్ ఎంతో తెలుసా?.. అంత తక్కువలో ఇంత పెద్ద సినిమానా..

    |

    కన్నడ చిత్ర పరిశ్రమలో మరో సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. పెద్దగా అంచనాలు లేకుండా కన్నడ భాషలో విడుదలైన కాంతార సినిమా ఇప్పుడు వివిధ భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంటుంది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 30న కేవలం కన్నడ భాషలోనే విడుదల చేశారు. ఎక్కువగా కన్నడ నేటివిటికి తగ్గట్టుగా అక్కడి కొన్ని ఆచారాలను పద్ధతులను సినిమాలో హైలెట్ చేస్తూ ఒక థ్రిల్లర్ డ్రామాగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

    కిరాక్ పార్టీ వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపును అందుకున్న రిషబ్ శెట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా సినిమాలో తనే హీరోగా కూడా నటించాడు. ఇక మొత్తానికి సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలోనే ఊహించని విధంగా రెస్పాన్స్ అందుకుంది. KGF లాంటి సినిమాలను నిర్మించిన హోంబెల్ ఫిలిమ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేసి మంచి లాభాలను అయితే అందుకుంటుంది. ఇక మొదట ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేయాలని అనుకోలేదు.

     Kannada movie kantara budget details and box office report

    కానీ కన్నడలో మంచి గుర్తింపు రావడంతో మిగతా ఆడియన్స్ నుంచి కూడా అదే భాషలో సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్క వారంలోనే సినిమాను డబ్ చేసి వివిధ భాషల్లో విడుదల చేసేందుకు ఆ నిర్మాణ సంస్థ సిద్ధమైంది. అయితే ఈ సినిమాను చూసిన తర్వాత అందరూ కూడా తప్పకుండా ఈ సినిమా కోసం 60 నుంచి 70 కోట్ల మధ్యలో ఖర్చు చేసి ఉంటారు అని అనుకున్నారు. కానీ నిజానికి ఈ సినిమాను కేవలం 18 కోట్ల తోనే నిర్మించారు.

    ఇక బాక్సాఫీస్ వద్ద దాదాపు 80 కోట్ల 90 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ అయితే ఈ సినిమా అందుకోబోతున్నట్లు అర్థమవుతుంది. సినిమాలో మంచి థ్రిల్లింగ్ డ్రామా ను హైలెట్ చేసిన విధానం ప్రేక్షకులను బాగా కట్టుకుంది. మొదట ఈ సినిమాను ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా రెస్పాన్స్ అందుకుంటు ఉండడంతో రిషబ్ శెట్టి పేరు కూడా వైరల్ గా మారిపోయింది. తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద సినిమాను ప్రజెంట్ చేసినట్లు విడుదల చేసిన విధానం కూడా హైలెట్ గానే నిలిచింది మరి మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి ఇంకా ఏ స్థాయిలో ఈ ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.

    English summary
    Kannada movie kantara budget details and box office report
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X