రూ.10కోట్లు వసూలు చేసిన 'పవర్'
బెంగళూరు : మీరు చదివింది కరెక్టే కానీ..ఈ న్యూస్ మాత్రం తెలుగు పవర్ ది మాత్రం కాదు. కన్నడ పవర్‌స్టార్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని ప్రధాన కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు రూ.10కోట్లకు పైగా కలెక్షన్లు నమోదైనట్లు నిర్మాతలు తెలిపాయి. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు పునీత్‌రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం దూకుడు. ఈ చిత్రం మహేష్...దూకుడు కి రీమేక్. 14 రీల్స్ వారే కన్నడంలోనూ నిర్మించారు. మాదేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్, త్రిష నటించారు. సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ రావటంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు.
ఇక ఈ చిత్రాన్ని డిస్ట్రీబ్యూట్ చేసిన సామ్రాట్ ప్రసాద్... సెకండ్ వీక్ లో బ్రెక్ ఈవెన్ వచ్చిందన్నారు. చాలా మంచి కలెక్షన్స్ రాబడుతోందని, 275 థియోటర్స్ లో విడుదల చేసామని అన్నారు. ఆయన పదిన్నర కోట్లకు ఈ చిత్రం రైట్స్ తీసుకున్నట్లు, యాభై లక్షలు పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టినట్లు చెప్తున్నారు. అవి మొదటి వారాంతానికి రివరివీ బాటలో ఉండటం తమని ఆనందపరిచిందని అన్నారు.

అలాగే ‘పవర్' ఆడియో కార్యక్రమానికి మహేష్ ముఖ్య అతిధిగా హాజరవ్వటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఆడియో వేడుకకి మహేష్ బాబు కోసం భారీగా అభిమానులు తరలి వచ్చారు. బళ్లారిలో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండడం వల్ల చాలా మంది మహేష్ బాబు కోసం ఈ ఆడియో వేడుకకి వచ్చారు. దాంతో ఆ విథంగా కూడా చిత్రానికి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ చిత్రం విజయంతో మరిన్ని తెలుగు చిత్రాలు కన్నడంలో రీమేక్ వస్తాయని కన్నడ పరిశ్రమలోని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా భారీ చిత్రాలు రైట్స్ ని కన్నడం రీమేక్ రైట్స్ కోసం


Click it and Unblock the Notifications











