Kannappa Total Collections : కన్నప్ప టోటల్ కలెక్షన్లు.. లాభమా? నష్టమా? ఎన్ని కోట్లు?

మంచు ఫ్యామిలీ నుంచి తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించారు. కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 27న పాన్ ఇండియా ఫిల్మ్ గా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఎన్ని కోట్లు బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది? ఇంతకీ లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..

కన్నప్ప చిత్రం బడ్జెట్ ఎంత?
మంచు మోహన్ బాబు కన్నప్ప చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఈ చిత్ర నిర్మాణ విషయంలో ప్రతిది హైలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్టార్ కాస్ట్, టాప్ టెక్నీషియన్లు, సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే పూర్తిచేయడం వంటి విషయాలతో భారీ బడ్జెట్ అయ్యింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు 120 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Kannappa Box Office Total Collections Worldwide

కన్నప్ప ఎన్ని కోట్లు వసూళ్లు చేయాల్సింది?
మంచు విష్ణు కెరీయర్ లో హ్యయెస్ట్ బ్రేక్ పాయింట్ కలిగిన చిత్రం కన్నప్ప. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 5250 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, హిందీలో జయంతీలాల్ గడా, కేరళలో ఆశీర్వాద్ పిక్చర్స్, కర్ణాటకలో రాక్‌లైన్ వెంకటేష్, నార్త్ అమెరికాలో వసారా ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో డీఎంవై క్రియేషన్స్ కన్నప్ప చిత్రాన్ని విడుదల చేయడం విశేషం. భారీ అంచనాలు ఏర్పడటంతో ఈ చిత్రానికి 90 కోట్ల రూపాయల షేర్, 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

కన్నప్ప టోటల్ బాక్సాఫీస్ వసూళ్లు ఎంత?
జూన్ 27న కన్నప్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఖాతా ఓపెన్ చేసింది. ఓపెనింగ్ డే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.13 కోట్ల గ్రాస్ అందడం విశేషం. ఇక 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35 వసూల్ చేసింది. ఇక 8వ రోజు నుంచి వసూళ్లు మొత్తం లక్షల్లోనే అందాయి. దీంతో 2వ వారంలోనే సినిమా వసూళ్లుగా పూర్తి క్షీణించాయని సాక్ నిక్ ఇచ్చిన రిపోర్ట్ లు వెల్లడించాయి. ఇలా లైఫ్ టైమ్ కన్నప్ప వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 46 కోట్లు మాత్రమే వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు లెక్క తేల్చేశారు.

కన్నప్పకు లాభమా? నష్టమా?
ఇప్పటికే కన్నప్ప బాక్సాఫీస్ రిపోర్ట్ ను పరిశీలిస్తే నష్టాల్లోనే కూరుకుపోయిందని అర్థమవుతోంది. కాగా కన్నప్ప చిత్రం లాభాల్లోకి రావాలంటే 180 కోట్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. కానీ ఇందులో లాంగ్ రన్ లో కన్నప్ప చిత్రం కేవలం 46 కోట్ల రూపాయలు మాత్రమే వసూళ్లు చేసింది. దీంతో ఇంకా 134 కోట్ల రూపాయలు బాకీ పడింది. ఇందులో హిందీ శాటిలైట్ రైట్స్ ద్వారా 20 కోట్ల రూపాయలు తిరిగి వచ్చినట్టు నిపుణులు తెలిపారు. దీంతో ఇంకా 114 కోట్ల రూపాయలు మైనస్ లో ఉంది. ఇంకా ఓటీటీ హక్కులు, ఇతర నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినా కూడా ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయలు నష్టాల్లోనే ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X