Kannappa Box Office Day 1: మంచు విష్ణు సరికొత్త చరిత్ర.. కన్నప్ప మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్లంటే?

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మనందం తదితరులు కీలకపాత్రలు పోషించారు. చిత్ర సీమలో భారీ అంచనాలు నెలకొన్న కన్నప్ప చిత్రం తొలి రోజు ఎన్నికోట్లు రాబట్టింది? ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కన్నప్ప బడ్జెట్ ఎంత?
అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై కన్నప్ప చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి స్వయంగా మంచు విష్ణు కథ , స్క్రీన్ ప్లేను అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కన్నప్ప సినిమాకు దాదాపు రూ.120 కోట్ల నిర్మాణ వ్యయం అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేశారు.

Kannappa Day 1 Expected Box Office Collections Worldwide Manchu Vishnu s Film set to break records

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
కన్నప్ప చిత్రాన్ని సొంతంగా విడుదల చేయాలని మంచు విష్ణు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, కర్ణాటకలో రాక్‌లైన్ వెంకటేష్, కేరళలో మోహన్ లాల్‌కి చెందిన ఆశీర్వాద్ పిక్చర్స్, హిందీలో జయంతీలాల్ గడా, నార్త్ అమెరికాలో వసారా ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో డీఎంవై క్రియేషన్స్ సంస్థలు కన్నప్ప చిత్రాన్ని రిలీజ్ చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000 సహా ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో కన్నప్పను విడుదల చేశారు. కన్నప్ప లాభాల్లోకి రావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో కన్నప్ప రికార్డ్
అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే కన్నప్పకు బాగా టికెట్లు తెగాయి. కేవలం 24 గంటల్లోనే 1,15,000 టికెట్లు సేల్ అయినట్లు మంచు విష్ణు స్వయంగా తెలిపారు. ఇక జూన్ 27న మార్నింగ్ షో నుంచే కన్నప్ప చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బుకింగ్స్ జోరందుకున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగులో 50.55 శాతం, తమిళంలో 11.52 శాతం, హిందీలో 4.83 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. చెన్నైలో 63, హైదరాబాద్‌లో 388, బెంగళూరులో 310, విశాఖలో 103, విజయవాడలో 75, ఢిల్లీలో 106, ముంబైలో 86, త్రివేండ్రంలో 81 షోల చొప్పున ప్రదర్శించారు. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ బాగుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కన్నప్ప తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
కన్నప్ప కలెక్షన్ల విషయానికి వస్తే.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మంచు విష్ణు చిత్రం దుమ్మురేపుతోంది. గురవారం సాయంత్రం నాటికి హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.1.05 కోట్లు.. 37 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు తెలిపింది. ఇక ఇండియా వైడ్ అయితే అడ్వాన్స్ సేల్స్ కింద రూ.4.53 శాతం కోట్లను రాబట్టినట్లుగా సినీ డిస్కో, బుక్ మై షోలు తెలిపారు. కన్నప్ప ఆంధ్ర, నైజాంలలో తొలిరోజు రూ.8 కోట్లు రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మోహన్‌లాల్, శరత్ కుమార్‌ల కారణంగా కేరళ, తమిళనాడులలో కన్నప్పకు సాలీడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నార్త్‌లో ఈ చిత్రానికి ప్లస్ కావొచ్చు. తద్వారా ఇండియాలో కన్నప్ప తొలిరోజు రూ.5 కోట్ల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. ఓవర్సీస్‌లోనూ కన్నప్పపై భారీ అంచనాలు ఉండటంతో అక్కడ రూ.2 కోట్లు వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చని అంటున్నారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప చిత్రం రూ.15 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి మంచు విష్ణు ఎలాంటి మేజిక్ చేశాడో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X