Kannappa Day 1 Collections: ఆ మ్యాజిక్‌తో కన్నప్పకు భారీ ఓపెనింగ్స్.. విష్ణు మంచు మూవీకి ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. భారతీయ పౌరాణిక చరిత్రలో గొప్ప కథగా ప్రజల మనసులో నిలిచిన ఈ స్టోరీని కన్నప్ప సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..
కన్నప్ప బడ్జెట్ ఎంతంటే?
కన్నప్ప సినిమాను పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఈ మూవీని దాదాపు 80 శాతం న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం 7 వేల ఎకరాల రిసార్ట్‌ను లీజుకు తీసుకొన్నారు. కేవలం ప్రభాస్, అక్షయ్ కుమార్ నటించిన ఎపిసోడ్స్ మాత్రమే ఇండియాలో షూట్ చేశారు. ఈ సినిమా కోసం ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా రిచ్‌గా, టెక్నికల్‌గా సౌండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం భారీగా ప్రమోట్ చేస్తూ హిందీ, మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఈవెంట్ల ఖర్చులనీ కలిపి బడ్జెట్‌ను సుమారుగా 120 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

కన్నప్ప మూవీ రిలీజ్ ఎలా అంటే?
కన్నప్ప సినిమా ప్రొడక్షన్ వ్యవహారంలోను, ప్రమోషన్స్ పరంగా, డిస్టిబ్యూషన్ పరంగా విష్ణు మంచు అన్నీ తానై వ్యవహరించారు. ఈ సినిమాను బిజినెస్ చేయకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోను సొంతంగా రిలీజ్ చేయాలని ఆయన రిస్క్ తీసుకోవడం ఇండస్ట్రీలో టాక్‌గా నిలిచింది. కేరళలో మోహన్ లాల్ సొంత డిస్టిబ్యూషన్ ఆశీర్వాద్ పిక్చర్స్, హిందీలో జయంతీలాల్ గడా, తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, కర్ణాటకలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, ఓవర్సీస్‌లో అంటే నార్త్ అమెరికాలో వసారా ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో డీఎంవై క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
ఇక ఇండియాలోని స్టార్ హీరోలంతా కలిసి నటించిన ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమా ప్రీ సేల్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. బుక్ మై షోలో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమా కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 17 కోట్ల రూపాయలు వసూళ్లు, కన్నడ, తమిళ్, మలయాళంలో 1 కోటి రూపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హిందీ, ఇతర రాష్ట్రాల్లో
ఇక హిందీ మార్కెట్‌లో అక్షయ్ కుమార్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. ఈ సినిమా నార్త్ ఇండియాలో 2 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ఇండియాలో 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. ఇక ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. ఈ కలెక్షన్ల రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదని పేర్కొన్నారు.
ఓవర్సీస్‌లో ఎన్ని కోట్లంటే?
కన్నప్ప సినిమాకు ఓవర్సీస్‌లో కూడా మంచి స్పందన లభించే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో 6 కోట్లలో రూపాయలు వసూలు చేస్తుంది. ఇండియాలో 24 కోట్ల రూపాయలతో కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. హిట్ టాక్ లభిస్తే.. నార్త్, కేరళలో కలెక్షన్లు పంజుకొనే అవకాశం ఉంది. దాంతో కలెక్షన్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











