Kannappa Box Office Day 11: షాకింగ్.. కన్నప్ప 11వ రోజు వసూళ్లు ఇలా.. వరల్డ్ వైడ్ గా ఎంత వచ్చిందంటే?
మొదటి వారం కన్నప్ప బాక్సాఫీస్ వసూళ్లు అదిరిపోయాయి. కానీ 2వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కలెక్షన్లు దారుణంగా మారాయి. సెకండ్ వీక్ లో కూడా షాకింగ్ గా వసూళ్లు అందాయి. మంచు విష్ణు కెరీయర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ కు బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించగా, మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందించారు. ప్రస్తుతం 2వ వారంలో కన్నప్ప వసూళ్లు రాబడుతోంది.ఈ క్రమంలో కన్నప్ప సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 11వ రోజు వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..
కన్నప్ప బడ్జెట్ ఎంత?
కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు నిర్మాతగా అనుభవం ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ను చక్కగా రూపొందించారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా లోటు రాకుండా చూసుకున్నారు. హిందూ చరిత్ర, పురణాలను చెబుతుండటంతో మరింత శ్రద్ధ వహించారు. టాప్ స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ను నటించేలా చేశారు. హిందీ మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తో డైరెక్ట్ చేయించారు. పూర్తిగా న్యూజిలాండ్ లోనే 7000 ఎకరాల్లో చిత్రీకరించారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. దీంతో సినిమాకు రూ.200 కోట్ల వరకు ఖర్చైందని మంచు విష్ణు తెలిపారు.

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇండియాలోని భారీ స్టార్ కాస్ట్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కన్నప్ప చిత్రంలో నటించడంతో సినిమాకు మరింత వాల్యూ పెరిగింది. అలాగే హిందూ పురణాలు తెలియజేసే సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మరింత ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు మార్కెట్ లోనూ సినిమాకు డిమాండ్ పెరిగింది. ఇలా వరల్డ్ వైడ్ గా భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, ఈ చిత్రం టోటల్ గా రూ.180 కోట్లు తిరిగి వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
కన్నప్ప 11 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
కన్నప్ప చిత్రానికి ఉన్న హైప్ తో ఓపెనింగ్ డే రూ.13 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35, 8వ రోజు రూ.70 లక్షలు, 9వ రోజు రూ.75 లక్షలు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక 10వ రోజు రూ.68 లక్షల నెట్ వసూల్ చేసింది. 11వ రోజు కేవలం రూ.22 లక్షలు నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ గణంకాలు తెలుపుతున్నాయి. అంటే రూ.40 లక్షల వరకు గ్రాస్ వసూలైందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు.
వరల్డ్ వైడ్ గా ఎంత వసూలైందంటే?
11వ రోజు వరకు కన్నప్ప చిత్రం ఇండియా నెట్ రూ.32.15 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ వెల్లడించింది. ఇక ఇండియా గ్రాస్ రూ.36.65 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5.1 కోట్లు వసూల్ చేసిందని తెలిపారు. దీంతో ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.41.75 కోట్లు మాత్రమే వసూల్ చేసిందని సాక్ నిల్క్ బాక్సాఫీస్ రిపోర్ట్ లో ఉంది.
కేవలం తెలుగులోనే..
ఇక ప్రస్తుతం కన్నప్ప చిత్రానికి కేవలం తెలుగులోనే వసూళ్లు అందుతున్నాయి. 200 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఎంతో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం మొదటి వారానికే భాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. ఇక 2వ వారం ఎంట్రీ ఇచ్చాక వసూళ్లు మరీ క్షీణించాయి. రెపో మాపో కలెక్షన్లు పూర్తిగా ఆగిపోయేలా ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











