Kannappa Box Office Day 12: కన్నప్ప 12వ రోజు కలెక్షన్లు.. ఇండియాలో కంటే అక్కడే బెటర్.. ఎన్ని కోట్లంటే?
బాక్సాఫీస్ వద్ద కన్నప్ప చిత్రానికి ప్రస్తుతం కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. పట్టుమని 10 రోజులు అయ్యిందో లేదో సినిమాకు ఇతర భాషల్లో వసూళ్లు ఆగిపోయాయి. ఇక ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లోనే కలెక్షన్లను రాబడుతోంది. మంచు విష్ణు కెరీయర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ను ఇండియాలోని ఐదు ప్రధాన భాషలతోనూ పాటు ఓవర్సీస్ లోనూ జూన్ 27న గ్రాండ్ గా విడుదల చేశారు. మొదటి వీక్ వసూళ్లు ఆశాజనకంగానే కనిపించినా.. 2వ ఎంట్రీతో లెక్కలు మారిపోయాయి. ఈ క్రమంలో కన్నప్ప సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 12వ రోజు వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..
కన్నప్ప బడ్జెట్ ఎంత?
టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించగా కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించారు. AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందించిన ఈ చిత్రంలో టాప్ స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటించడం విశేషం. మరోవైపు సినిమాను పూర్తిగా న్యూజిలాండ్ లోని 7 వేల ఎకరాల్లోనే షూట్ చేశారు. మరోవైపు తారాగణాన్ని మొత్తం అక్కడికే తీసుకెళ్లి బస ఏర్పాటు చేసి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. ఇక రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలను కలుపుకొని ఈ చిత్రానికి రూ.200 కోట్ల వరకు ఖర్చైందని మేకర్స్ తెలిపారు.

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
హిందూ చరిత్రను చెబుతూ పురాణాల ఆధారంగా తీసిన చిత్రం కావడంతో ఇండియా వైడ్ గా కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. మరోవైపు అన్నీ భాషల నుంచి స్టార్ కాస్ట్ ఉండటంతో వారి క్రేజ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు బలమైంది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని, దీంతో రూ.180 కోట్ల వరకు తిరిగి రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. అప్పుడే సినిమా లాభాల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు నాన్ థియేట్రికల్ రైట్స్ లో హిందీ శాటిలైట్ హక్కులను ముంబై బేస్డ్ ఏజెన్సీకి రూ.20 కోట్లకు అమ్మడం విశేషం.
కన్నప్ప 12 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
2వ వారంలో వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ చిత్రం ఓపెనింగ్ డే రూ.13 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35, 8వ రోజు రూ.70 లక్షలు, 9వ రోజు రూ.75 లక్షలు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలుపుతోంది. ఇక 10వ రోజు రూ.68 లక్షల ఇండియా నెట్, 11వ రోజు రూ.22 లక్షల ఇండియా నెట్, 12వ రోజు కేవలం రూ.16 లక్షల ఇండియా నెట్ మాత్రమే వసూల్ చేసింది. దీంతో 12వ రోజు వరకు ఈ చిత్రం ఇండియా నెట్ రూ.32.31 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక గ్రాస్ రూ.45 కోట్ల వరకు చేరుకుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కన్నప్పకు అక్కడే బెటర్ కలెక్షన్లు..
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు తెలుగు హీరో కావడంతో తెలుగు స్టేట్స్ లో కలెక్షన్లు రావడం సహజం. కన్నప్పకు ముందు తెలుగు స్టేట్స్ లోనే విష్ణు వసూళ్లు సాధించడం కష్టం. అలాంటి ఈ చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా పరిచయం అయ్యారు. అయితే కన్నప్ప చిత్రానికి తెలుగు స్టేట్స్ లో ఇప్పటి వరకు రూ.26.59 కోట్ల నెట్ వసూలైతే... ఇక మిగిలిన అన్నీ భాషలు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో కలిపి రూ.5.69 కోట్ల నెట్ వసూల్ అయ్యింది. ఇక కేవలం ఓవర్సీస్ లో రూ.5.1 కోట్లు వసూళ్లవడం విశేషం. ఈ లెక్కన 12 శాతం ఓవర్సీస్ లోనే వసూల్ చేసింది. దీంతో మంచు విష్ణుకు ఓవర్సీస్ లోనే వసూళ్లు బెటర్ అని అంటున్నారు. మరోవైపు వచ్చిన కలెక్షన్లలో హిందీ మార్కెట్ ఎక్కువ భాగమే వసూల్ చేసింది. ఇక 9వ రోజు వరకు మాత్రం హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఓవర్సీస్ లో వసూళ్లు ఆగిపోయాయి. కేవలం తెలుగులోనే ఆడపాదడపా వసూళ్లు అందుతున్నాయి.


Click it and Unblock the Notifications











