Kannappa Box Office Day 13: 8 ఏళ్ల శ్రమ.. ఇదైతే దారుణమే.. కన్నప్ప 13వ రోజు వసూళ్లు ఇలా
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప చిత్రాన్ని రూపొందించారు. ఆయన కెరీయర్ లోనే తొలిసారిగా భారీ బడ్జెట్ చిత్రంలో నటించారు. పైగా నిర్మాతగా ఎంతో అనుభవం ఉన్న కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ చిత్రానికి భారీగా ఖర్చు చేయడం విశేషం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఎంతో గ్రాండ్ గా ప్రచారం చేసి జూన్ 27న చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ప్రస్తుతం బాక్సాఫీస్ వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలో కన్నప్ప చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 13వ రోజు వరల్డ్ వైడ్ ఎంత వసూల్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
కన్నప్ప బడ్జెట్ ఎంత?
AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు భారీ విజువల్స్ ఎఫెక్ట్స్ తో కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో టాప్ స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. ఇక పూర్తి సినిమాను న్యూజిలాండ్ లో 7 వేల ఎకరాల అద్భుతమైన లోకేషన్లలో చిత్రీకరించారు. సినిమాను మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారు. ఇలా రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలను కలుపుకొని సినిమాకు రూ.200 కోట్ల వరకు ఖర్చైందని మేకర్స్ తెలిపారు.

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
హిందూ మైథలాజికల్ ఫిల్మ్ కావడం, భారీ తారగణం నటించడంతో కన్నప్ప చిత్రంపై భారీ హైప్ నెలకొంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ విడుదల చేయడంతో సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో కన్నప్ప చిత్రం రూ.180 కోట్ల వరకు థియేట్రికల్ రన్ ద్వారా రాబట్టాలని అప్పుడే లాభాల భాట పడుతుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
కన్నప్ప 13 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
2వ వారంలో వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ చిత్రం ఓపెనింగ్ డే రూ.13 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35, 8వ రోజు రూ.70 లక్షలు, 9వ రోజు రూ.75 లక్షలు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. మరోవైపు 10వ రోజు రూ.68 లక్షలు, 11వ రోజు రూ.22 లక్షలు, 12వ రోజు రూ.16 లక్షలు, ఇక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. 13వ రోజు రూ.15 లక్షలు ఇండియా నెట్ మాత్రమే వసూల్ చేసిందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి.
130 కోట్లు నష్టమేనా?
కనప్ప చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఈ చిత్రానికి రూ.130 కోట్లు ఇంకా తిరిగి రావాల్సి ఉంది. మొదటి వారంలో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కోట్లల్లో వసూల్ అందాయి. కానీ 2వ వారంలో మాత్రం పూర్తిగా వసూళ్లు తగ్గిపోయాయి. 7 రోజుల్లోనే సినిమా వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 20 లక్షలకు మించి వసూళ్లు అందడం లేదు. మంచు విష్ణు 8 ఏళ్లు కష్టపడి కన్నప్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా మాత్రం మంచు విష్ణుకు బిగ్ షాక్ అనే చెప్పాలి. టాక్ కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వసూళ్లు ఉంటే బాగుండని మంచు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











