Kannappa Box Office Day 14 : 2 వారాలు పూర్తి.. విష్ణపై ఎన్ని కోట్ల భారం.. కన్నప్ప 14వ రోజు కలెక్షన్ ఎంతంటే?
బాక్సాఫీస్ వద్ద కన్నప్ప చిత్రం నేటీతో 2 వారాలను పూర్తి చేసుకుంది. మంచు విష్ణు కెరీయర్ లోనే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుందీ చిత్రం. భారా తారగణంతో కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కన్నప్ప చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ జూన్ 27న ఘనంగా విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద చిత్రానికి 1వ వారం మంచి రెస్పాన్స్ దక్కింది. కానీ 2వ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వసూళ్ల లెక్కలు దారుణంగా మారిపోయాయి. ఈ క్రమంలో కన్నప్ప చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 14వ రోజు వరల్డ్ వైడ్ ఎంత వసూలైందనే వివరాల్లోకి వెళితే..
కన్నప్ప బడ్జెట్ ఎంత?
మోహన్ బాబు నిర్మాతగా AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లలో కన్నప్ప చిత్రాన్ని నిర్మించడం విశేషం. టాప్ స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అయ్యారు. పైగా షూటింగ్ మొత్తాన్ని న్యూజిలాండ్ లో పూర్తి చేశారు. అక్కడ 7 వేల ఎకరాలను లీజ్ కు తీసుకున్నారు. మరోవైపు సినిమాకు మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. టాప్ టెక్నీషియన్లు చిత్రం కోసం పనిచేయడంతో భారీ గానే ఖర్చైంది. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులు కలుపుకొని సినిమాకు రూ.120 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. కానీ 200 కోట్లు అయ్యిందని మేకర్స్ తెలిపారు.

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
మంచు ఫ్యామిలీ నుంచి తొలిసారిగా భారీ బడ్జెట్ తో కన్నప్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణం నటించడం, హిందూ మైథలాజికల్ చిత్రం కావడం, పాన్ ఇండియా ఫిల్మ్ గా విడుదల చేయడంతో సినిమాకు భారీగానే ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని నిపుణులు అంటున్నారు. థియేట్రికల్ ద్వారా 30 కోట్ల వ్యాపారం అయ్యిందని తెలుపుతున్నారు. మరోవైపు నాన్ థియేట్రికల్ లో హిందీ శాటిలైట్ ద్వారా రూ.20 కోట్లు అందాయని తెలుస్తోంది. ఇలా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.180 కోట్లు కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
కన్నప్ప 13 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
2వ వారంలో వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ చిత్రం ఓపెనింగ్ డే రూ.13 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35, 8వ రోజు రూ.70 లక్షలు, 9వ రోజు రూ.75 లక్షలు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. మరోవైపు 10వ రోజు రూ.68 లక్షలు, 11వ రోజు రూ.22 లక్షలు, 12వ రోజు రూ.16 లక్షలు, 13వ రోజు రూ.15 లక్షలు, ఇక తాజాగా 14వ రోజు రూ.13 లక్షల ఇండియా నెట్ మాత్రమే వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రూ.32.59 కోట్ల ఇండియా నెట్, రూ.36.65 కోట్ల ఇండియా గ్రాస్ వసూలైంది. రూ.48 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
మంచు విష్ణుకు ఇదే లాస్ట్ ఛాన్స్..
కన్నప్ప చిత్రం నేటితో బాక్సాఫీస్ వద్ద 2 వారాలను పూర్తి చేసుకుంది. అయితే మొదటి వారం ఈ చిత్రానికి భారీగానే వసూళ్లు అందాయి. ఏకంగా రూ.30.2 కోట్ల ఇండియా నెట్ వసూలైంది. ఇక 2వ వారంలో అడుగు పెట్టిన తర్వాత కన్నప్ప సినిమాకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు క్షీణించి పోయాయి. అయితే ఈ చిత్రానికి 3వ వీకెండ్ మాత్రమే చివరి అవకాశం మారింది. శుక్ర, శని, ఆదివారాల్లో బాక్సాఫీస్ వసూళ్లు మెరుగైతే సినిమా నష్టాల నుంచి బయట పడే అవకాశం ఉంది. లేదంటే మంచు విష్ణుపై రూ.100 కోట్ల వరకు భారం పడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











