Kannappa Box Office Day 15: 3వ వీకెండ్ కూడా ముంచేసింది.. కన్నప్ప 15వ రోజు కలెక్షన్స్!

మంచు విష్ణు కన్నప్ప చిత్రం ప్రస్తుతం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా సినిమా బాక్సాఫీస్ వసూళ్లు షాకింగ్ గా మారాయి. కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27న ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ క్రమంలో కన్నప్ప చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 15వ రోజు వరల్డ్ వైడ్ ఎంత వసూలైందనే వివరాల్లోకి వెళితే..

కన్నప్ప బడ్జెట్ ఎంత?
AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లలో మోహన్ బాబు నిర్మాతగా కన్నప్ప చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇండియాస్ టాప్ స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మరోవైపు సినిమా మొత్తాన్ని న్యూజిలాండ్ లోని 7 ఎకరాల్లో గల ఆకర్షణీయమైన లోకేషన్లలో నిర్మించడం విశేషం. అలాగే మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయడం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమాకు భారీ గానే ఖర్చైంది. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలను కలుపుకుని రూ.120 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Kannappa Day 15 Box Office Collections Worldwide

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
భారీ తారాగణం నటించడం, మొదటిసారి మంచు ఫ్యామిలీ నుంచి భారీ బడ్జెట్ చిత్రం రూపుదిద్దుకుంటుండటం, హిందూ మైథలాజికల్ చిత్రం కావడం, భారీ విజువల్స్ ను చూపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దాంతో థియేట్రికల్ ద్వారా 30 కోట్ల వ్యాపారం, నాన్ థియేట్రికల్ లో హిందీ శాటిలైట్ ద్వారా రూ.20 కోట్లు అందుకొని ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యాపారం జరిగింది. మరిన్ని లెక్కలు కలుపుకొని ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.180 కోట్లు బాక్సాఫీస్ వద్ద వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.

కన్నప్ప 14 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
కన్నప్ప చిత్రం ఓపెనింగ్ డే రూ.13 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35, 8వ రోజు రూ.70 లక్షలు, 9వ రోజు రూ.75 లక్షలు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. మరోవైపు 10వ రోజు రూ.68 లక్షలు, 11వ రోజు రూ.22 లక్షలు, 12వ రోజు రూ.16 లక్షలు, 13వ రోజు రూ.15 లక్షలు, 14వ రోజు రూ.13 లక్షల ఇండియా నెట్ అందుకుంది.

కన్నప్ప 15వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు..
ప్రస్తుతం కన్నప్ప చిత్రం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారంలోకి సినిమాకు భారీగానే వసూళ్లు దక్కాయి. ఇక 2వ వారంలో భారీ క్షీణించింది. అయినప్పటికీ 3వారం ప్రారంభం, 3వ వీకెండ్ ఉండటంతో కాస్తా వసూళ్లు మెరుగవుతాయని అంతా ఆశించారు. కానీ కన్నప్ప 15వ రోజు మాత్రం కేవలం రూ.5 లక్షల ఇండియా నెట్ మాత్రమే వసూల్ చేసింది. దీంతో 3వ వీకెండ్ పై ఉన్న ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఇక 15 రోజు వరకు ఈ చిత్రం రూ.32.64 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇక ఓవర్సీస్ లో రూ.5.1 కోట్లు వసూల్ చేసి ఆగిపోయింది. ఇండియా గ్రాస్ రూ.36.71 కోట్లు అందాయని సాక్ నిల్క్ రిపోర్ట్ అందించింది. ఇక వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.48 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X