Kannappa Box Office Day 2: కన్నప్ప 2వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు.. మంచు విష్ణు మూవీకి ఎన్ని కోట్లంటే?

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కన్నప్ప. ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మనందం తదితరులు కీలకపాత్రలు పోషించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై కన్నప్ప చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మించారు. జూన్ 27న విడుదలైన కన్నప్ప సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది? ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? రెండో రోజు ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..

కన్నప్ప బడ్జెట్ ఎంత?
అత్యంత సహజంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు వచ్చేందుకు గాను న్యూజిలాండ్‌లోని 7000 ఎకరాల రిసార్ట్‌లో చిత్రీకరణ చేశారు. టెక్నికల్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో కన్నప్పను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ చిత్రానికి దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000 సహా ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో కన్నప్పను గ్రాండ్ రిలీజ్ చేశారు. రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లే లక్ష్యంగా కన్నప్ప తన జర్నీ ప్రారంభించింది.

Kannappa Day 2 Expected Box Office Collections Worldwide Manchu Vishnu s Film

కన్నప్ప తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
కన్నప్ప వసూళ్ల లెక్కలు చూస్తే.. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.13 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.8.25 కోట్లు, హిందీలో రూ.65 లక్షలు, తమిళంలో రూ.15 లక్షలు, కన్నడంలో రూ.10 లక్షలు, మలయాళంలో రూ.20 లక్షలు వచ్చాయి. తెలుగులో మాత్రమే ఈ సినిమా ఎక్స్‌లెంట్ హోల్డ్ చూపించగా.. కాజల్, అక్షయ్ కుమార్‌లు ఏమాత్రం ప్లస్ కాలేదని హిందీ కలెక్షన్స్ చూపెడుతున్నాయి. మోహన్‌లాల్, శరత్ కుమార్‌లు తమ రాష్ట్రాల్లో ఈ సినిమాను మోయలేదని విశ్లేషకులు తెలిపారు.

నిరాశ పరిచిన ఓపెనింగ్స్
కన్నప్ప ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేసినప్పటికీ ఇండియా వైడ్ తొలి రోజు రూ.9.35 కోట్ల నెట్, రూ.11 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్‌ నుంచి కన్నప్పకు మేజర్ షేర్ దక్కింది. తొలిరోజు మంచు విష్ణు సినిమాకు నార్త్ అమెరికా, ఇతర దేశాల ద్వారా రూ.2 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. వీకెండ్‌లో ఈ ఏరియాలో కలెక్షన్స్ పుంజుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్‌తో కలిసి తొలిరోజు కన్నప్ప 13 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

రెండో రోజు వసూళ్లు ఎంతంటే?
కన్నప్పకు రెండో రోజూ కలెక్షన్స్ చూస్తే సాయంత్రం 5 గంటల వరకు తమిళంలో 18.41 శాతం, తెలుగులో 36.13 శాతం, హిందీలో 11.45 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ నివేదించింది. హైదరాబాద్‌లో 380, బెంగళూరులో 297, విజయవాడలో 75, విశాఖలో 110, ఢిల్లీలో 110, ముంబైలో 87 చొప్పున షోలు ప్రదర్శితమయ్యాయి. రెండో సాయంత్రం 4 గంటల వరకు బుక్ మై షోలో దాదాపు 15 లక్షల టికెట్లు సేల్ అయినట్లుగా కన్నప్ప యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

రెండో రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, తమిళ్, కేరళ, కర్ణాటకలో 1.50 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలలో కోటి రూపాయలు చొప్పున ఇండియా వైడ్ రూ.4.50 కోట్లు రాబడుతుందని చెబుతున్నారు. ఇక ఓవర్సీస్‌లో కోటి రూపాయలు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. దీంతో మొత్తం కన్నప్ప రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.6 కోట్లు వసూళ్లు అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి మంచు విష్ణు ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X