Kannappa Box Office Day 3: కన్నప్పకు 3వ రోజు ఊహించని కలెక్షన్స్.. మంచు విష్ణు మూవీ లాభాల్లోకి రావాలంటే?

మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మనందం వంటి అగ్రనటులు కీలకపాత్రలు పోషించారు. స్టీఫెన్ దేవస్సి సంగీత సారథ్యం వహించగా.. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై కన్నప్ప చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం విడుదలైంది.

కన్నప్ప బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ చిత్రానికి దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ అయినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000 సహా ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో కన్నప్పను గ్రాండ్ రిలీజ్ చేశారు. రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లే టార్గెట్‌గా మోహన్ బాబు చిత్రం తన జర్నీ ప్రారంభించింది.

Kannappa Day 3 Expected Box Office Collections Worldwide Manchu Vishnu s Film heading towards 30 crores

కన్నప్ప తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
కన్నప్ప కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే.. ఈ సినిమా తొలిరోజు ఇండియాలో రూ.10 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. రెండో రోజు రూ. 7 కోట్లు అందుకుంది. రెండు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో 13.92 కోట్ల రూపాయలు, హిందీలో 1.5 కోట్ల రూపాయలు, కన్నడంలో 10 లక్షల రూపాయలు, తమిళంలో 35 లక్షల రూపాయలు, మలయాళంలో 35 లక్షల రూపాయలు రాబట్టింది. ఇండియా వైడ్ రెండ్రోజుల్లో 17 కోట్ల రూపాయల నెట్, 20 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?
కన్నప్పకు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా పుంజుకోవడం లేదు. తొలి రెండ్రోజులు బుకింగ్స్ నిలకడగానే ఉన్నప్పటికీ తర్వాత బుకింగ్స్ డల్‌గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నప్ప సినిమాకు ఓవర్సీస్‌లో 2.5 కోట్లు వచ్చాయి.

మూడో రోజు వసూళ్లు ఎంతంటే?
కన్నప్ప సినిమాకు మూడో రోజు సాయంత్రం 4 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 25.08 శాతం, తమిళ వెర్షన్‌లో 16.15 శాతం, హిందీ వెర్షన్‌లో 9.78 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 387 షోలు, బెంగళూరులో 296 షోలు, విజయవాడలో 81 షోలు, విశాఖలో 106 షోలు, చెన్నైలో 55 షోలు ప్రదర్శితమైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఆదివారం కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఎక్స్‌లెంట్ హోల్డ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు.. కర్ణాటక, కేరళ, తమిళనాడులో రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో కోటి రూపాయల చొప్పున వరల్డ్‌ వైడ్‌గా 8 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో కన్నప్ప మూడు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లు సాధించవచ్చని అంటున్నారు.

కన్నప్ప ముందు కొండంత లక్ష్యం
వసూళ్లు బాగున్నప్పటికీ కన్నప్ప ముందున్న భారీ లక్ష్యం చిత్ర యూనిట్‌ను భయపెడుతోంది. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు గాను మంచు విష్ణుమూవీ కేవలం 30 కోట్లు మాత్రమే సాధించింది. ఈ సినిమా టార్గెట్ కొట్టాలంటే ఇంకా రూ.60 కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. కీలకమైన వీకెండ్‌లోనూ ఈ సినిమా ఆశించిన స్థాయిలో బుకింగ్స్ అందుకోలేకపోతోంది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో కన్నప్ప ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X