Kannappa Box Office Day 4: కన్పప్ప 4వ రోజు షాకింగ్ వసూళ్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం కన్నప్ప. హిందీ మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ మైథాలజికల్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన 4వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా కన్నప్ప సినిమా బడ్జెట్, ఫ్రీ రిలీజ్ బిజినెస్, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్ల వివరాల్లోకి వెళితే...
కన్నప్ప బడ్జెట్ ఎంత?
మంచు ఫ్యామిలీలో మొదటిసారిగా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. పాన్ ఇండియా సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నిర్మాణ విలువలు ఉండాలని సినిమాకు భారీగానే ఖర్చు పెట్టారు. అందుకోసం న్యూజిలాండ్ లోని 7000 ఎకరాల అందమైన ప్రదేశంలో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులను న్యూజిలాండ్ కు తీసుకెళ్లి వసతుల ఏర్పాటుతో చిత్రీకరణ జరిపారు. అలాగే ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. ఇలా నటీనటుల రెమ్యూనరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులు, తదితరాలను కలుపుకొని సినిమాకు 200 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చయింది.

కన్నప్ప బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత?
కన్నప్ప చిత్రాన్ని ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4 వేల థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్ కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు స్పష్టంగా లేవు. కానీ కన్నప్ప చిత్రం వరల్డ్ వైడ్ గా 180 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
కన్నప్ప 3 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
కన్నప్ప కు ఓపెనింగ్ డే ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు అయింది. ఇందులో ఎక్కువ వసూళ్లు తెలుగు స్టేట్స్ నుంచి, ఓవర్సీస్ నుంచి ఉండడం విశేషం. 2వ రోజు 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 3వ రోజు 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ వసూళ్లను కూడా కలుపుకొని ఈ చిత్రం 40 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు.
కన్నప్ప 4వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు..
కన్నప్ప చిత్రం మొదటి వీకెండ్ లో జోరుగానే బాక్సాఫీస్ వద్ద వసూలు రాబట్టింది. కానీ 4వ రోజు సోమవారం ఈ చిత్రానికి మరి దారుణంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందాయి. వర్కింగ్ డే కావడంతో సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, ఇండియా వైడ్ 3 కోట్లు, వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 4వ రోజు ఇండియా +ఓవర్సీస్ కలుపుకొని 4 నుంచి 4.5 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











