Kannappa Box Office Day 5: భారీగా క్షీణించిన కన్నప్ప కలెక్షన్స్ .. మంచు విష్ణు మూవీ లాభాల్లోకి రావాలంటే?

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌లతో పాటు కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మనందం కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సి సంగీత సారథ్యం వహించగా.. షెల్డన్ చౌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై కన్నప్ప చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో కన్నప్పకు 5వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు పరిశీలిస్తే..

కన్నప్ప బడ్జెట్ ఎంత?
సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో మంచు ఫ్యామిలీ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను నిర్మించింది. అత్యంత సహజంగా సన్నివేశాలు ఉండేందుకు గాను న్యూజిలాండ్‌లో ఏకంగా 7000 ఎకరాల సువిశాల ప్రదేశంలో కన్నప్ప సినిమా చిత్రీకరణ నిర్వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ చిత్రానికి దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ అయినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

Kannappa Day 5 Box Office Collections Worldwide Manchu Vishnu s Film faces Heavy drop

కన్నప్ప బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000 సహా ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో కన్నప్పను గ్రాండ్ రిలీజ్ చేసింది మంచు ఫ్యామిలీ. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. అయితే కన్నప్ప చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

కన్నప్ప నాలుగు రోజులు వసూళ్లు
కన్నప్ప కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే.. ఈ సినిమాకు ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. 2వ రోజు 10 కోట్ల రూపాయలు, మూడవ రోజు 9 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌‌లోనూ కన్నప్ప చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 4.3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. వీటితో కలుపుకుని కన్నప్ప మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.44 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

కన్నప్ప ఐదో రోజు కలెక్షన్స్
వర్కింగ్ డేస్ కావడంతో కన్నప్పకు ఐదో రోజున బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. తెలుగు వెర్షన్‌లో 14.42 శాతం, హిందీలో 14.12 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 383 షోలు, బెంగళూరులో 278 షోలు, విజయవాడలో 70 షోలు, విశాఖలో 113 షోలు పడ్డాయి. ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.26 కోట్లు, హిందీలో రూ.40 లక్షలు, కన్నడంలో రూ.20 లక్షలు, తమిళంలో రూ.10 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షలు చొప్పున ఇండియా వైడ్‌ నికరంగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. మొత్తంగా 5వ రోజు ఇండియా+ ఓవర్సీస్ కలుపుకుని కన్నప్ప చిత్రానికి రూ.2.5 కోట్ల గ్రాస్ వచ్చాయి. దీనితో కలిపి కన్నప్పకు ఇప్పటి వరకు రూ. 46 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వసూళ్లను బట్టి చూస్తే కన్నప్ప బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా దాదాపు 140 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. త్వరలో వరుసగా సినిమాల రిలీజ్‌లు ఉండటంతో మంచు విష్ణు ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X