Kannappa Box Office Day 6: 50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. మంచు విష్ణు మూవీకి 6వ రోజు ఎన్ని కోట్లంటే?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. కెరీర్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన దశలో అలనాటి క్లాసిక్ భక్త కన్నప్పను రీమేక్ చేయాలని విష్ణు నిర్ణయించారు. బాలీవుడ్ సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. కన్నప్పలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్‌, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మనందం కీలకపాత్రలు పోషించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై కన్నప్ప చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మించారు. స్టీఫెన్ దేవస్సి సంగీత సారథ్యం వహించగా.. షెల్డన్ చౌ సినిమాటోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో కన్నప్పకు 6వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు పరిశీలిస్తే..

కన్నప్ప బడ్జెట్ ఎంత?
కన్నప్పను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంచు ఫ్యామిలీ ఈ చిత్ర నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. దాదాపు 80 శాతం షూటింగ్‌ని న్యూజిలాండ్‌లోనే చిత్రీకరించారంటేనే మంచు విష్ణు పట్టుదలను అర్ధం చేసుకోవచ్చు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా టాప్ టెక్నీషియన్స్‌తో ఔట్‌పుట్ రాబట్టడంలో విష్ణు సక్సెస్ అయ్యారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కన్నప్ప చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

Kannappa Day 6 Box Office Collections Worldwide Manchu Vishnu s Film Entered into 50 crores club

కన్నప్ప బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత?
సినిమాను భారీగా తీయడంతో పాటు విడుదల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంది మంచు ఫ్యామిలీ. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000 సహా ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో కన్నప్పను విడుదల చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందనేది బయటకు రాలేదు. అయితే కన్నప్ప చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

కన్నప్ప ఐదు రోజుల వసూళ్లు
కన్నప్ప ఇప్పటి వరకు రాబట్టిన కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే.. ఈ సినిమాకు ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. 2వ రోజు 10 కోట్ల రూపాయలు, మూడవ రోజు 9 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 4.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌‌లో తొలుత బాగానే కలెక్షన్స్ రాబట్టినప్పటికీ.. రాను రాను అక్కడ వసూళ్లు పడిపోయాయి. ఇప్పటి వరకు అక్కడ కన్నప్పకు 4.7 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. వీటితో కలుపుకుని కన్నప్ప మూవీ ఐదు రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

కన్నప్ప ఆరో రోజు కలెక్షన్స్
నాలుగు రోజుల వరకు బాక్సాఫీస్ వద్ద ఎదురు లేకుండా సాగిన కన్నప్ప సోమవారం నుంచి తడబడుతున్నాడు. బుకింగ్స్ డ్రాప్ అవుతూ వసూళ్లు పడిపోతున్నాయి. వర్కింగ్ డేస్ ప్రభావం సినిమాపై గట్టిగా చూపిస్తోంది. ఆరో రోజున తెలుగు వెర్షన్‌లో 12.54 శాతం, హిందీలో 6.84 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. తమిళ్, కన్నడ, మలయాళంలో మంచు విష్ణు పూర్తిగా చేతులెత్తేసినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఆరో రోజున హైదరాబాద్‌లో 377 షోలు, బెంగళూరులో 265 షోలు, విజయవాడలో 68 షోలు, విశాఖలో 109 షోలు పడ్డాయి. ఆరో రోజున ఇండియా వైడ్‌ కన్నప్ప చిత్రం 1.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. దీంతో ఆరు రోజుల వరకు మంచు విష్ణు సినిమా ఇండియాలో 47 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టగా.. దానికి ఓవర్సీస్ వసూళ్లు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 51 కోట్ల రూపాయల కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X