Kannappa Box Office Day 7: కన్నప్ప 7 రోజుల వసూళ్లు.. వారంలో ఎంత వసూలైంది? ఇంకెన్ని కోట్లు రావాలి?
మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీలోనే ఈ చిత్రం తొలిసారిగా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలతో పాటు ఓవర్సీస్ లోనూ జూన్ 27న గ్రాండ్ గా విడుదలైంది. ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో మాత్రం భారీగానే వసూళ్లు రాబడుతోంది. కాగా కన్నప్ప చిత్రం మొదటి 7 రోజుల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో కన్నప్ప చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 7వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత? ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలనే వివరాల్లోకి వెళితే..
కన్నప్ప బడ్జెట్ ఎంత?
కన్నప్ప చిత్రానికి హిందీ మహాభారతం సీరియల్ డైరెక్ట్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే చిత్రీకరించారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. దీంతో సినిమాకు భారీగానే ఖర్చైంది. నిర్మాణ ఖర్చు, రెమ్యునరేషన్స్, ప్రమోషన్స్ అన్నీ కలుపుకొని మొత్తం రూ.120 కోట్ల వరకు ఖర్చు చేశారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

కన్నప్ప చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్?
మంచు విష్ణు కన్నప్ప చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగిందని తెలుస్తోంది. దీంతో థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం రూ.180 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉందని ట్రేడ్ పండింతులు విలువ కట్టారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన హిందీ శాటిలైట్ రైట్స్ ఇప్పటికే రూ.20 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం.
కన్నప్ప 7 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
ఓపెనింగ్ డే కన్నప్ప చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.13 కోట్ల గ్రాస్ అందింది. 2వ రోజు రూ.10 కోట్ల రూపాయల గ్రాస్, 3వ రోజు రూ.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 4వ రోజు రూ. 3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు వసూళ్లు చేసింది. ఇక 7వ రోజు ఈ చిత్రానికి కేవలం తెలుగు స్టేట్స్ నుంచి రూ.1.03 కోట్లు, హిందీ నుంచి రూ.26 లక్షల నెట్ వసూళ్లు చేసింది సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో 7వ రోజు రూ.1.5 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నారు. మొదటి వారం కన్నప్ప చిత్రం 30.14 కోట్ల ఇండియా నెట్, రూ.35 కోట్ల ఇండియా గ్రాస్, 5 కోట్ల ఓవర్సీస్ వసూళ్లను రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.40 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
కన్నప్ప చిత్రం ఇంకెంత వసూల్ చేయాలి?
ప్రస్తుతం కన్నప్ప చిత్రం ఓ మాదిరిగా వసూళ్లు రాబడుతోంది. 7 రోజుల్లో ఈ చిత్రానికి తమిళం, మలయాళం, కన్నడ నుంచి వసూళ్లు ఆగిపోయాయి. ప్రస్తుతం తెలుగు స్టేట్స్, హిందీలో మాత్రమే బాక్సాఫీస్ కలెక్షన్స్ దక్కుతుండటం విశేషం. అయితే ప్రస్తుతం కొత్త సినిమాలు తమ్ముడు, ఉప్పు కప్పురంబు, మున్ముందు హరిహర వీరమల్లు చిత్రాలు ఉండటంతో ఈ సినిమా వసూళ్లుపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది చూడాలి. ఇక కన్నప్ప చిత్రం 40 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టడంతో ఇంకా రూ.140 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నారు. ఇందులో కేవలం 30శాతం మాత్రమే రికవరీ చేసింది. మున్ముందు ఇంకెంత వసూల్ చేస్తుందనేది చూడాలి.


Click it and Unblock the Notifications











