Kannappa Box Office Day 8: 2వ వారంలోకి కన్నప్ప ఎంట్రీ.. షాకింగ్ గా 8వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కన్నప్ప. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సినిమాలో భారీ తారాగణం నటించడంతో ప్రేక్షకుల నుంచి మొదటి వారం విశేష స్పందన లభించింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం 2వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించడం విశేషం. AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 8వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత? 2వ వారంలో కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనే వివరాల్లోకి వెళితే..
కన్నప్ప బడ్జెట్ ఎంత?
ఆధ్యాత్మికతను చూపించేందుకని కన్నప్ప చిత్రాన్ని పూర్తిగా న్యూజిలాండ్ లోనే 7000 ఎకరాల్లో చిత్రీకరించారు. పైగా ఈ చిత్రంలో భారీ తారాగణం నటించింది. మరోవైపు హిందీ మహాభారతం సీరియల్ డైరెక్ట్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. మరోవైపు వీఎఫ్ఎక్స్, సౌండ్, యాక్షన్ కొరియోగ్రఫీ క్రాఫ్ట్స్ ల్లో ఎక్స్ పర్ట్స్ పని చేశారు. దీంతో సినిమాకు రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్, ఇతరాత్ర ఖర్చులు కలుపుకొని రూ 120 కోట్ల రూపాయల వరకు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
మొట్టమొదటిసారిగా మంచు ఫ్యామిలీ నుంచి భారీ చిత్రం రూపుదిద్దుకోవడం, ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుండటంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ కారణంగా కన్నప్ప చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలో కేవలం థియేట్రికల్ రన్ ద్వారా కన్నప్ప చిత్రం రూ.180 కోట్లు వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. ఇక నాన్ థియేట్రికల్ గా ఇప్పటి వరకైతే హిందీ శాటిలైట్ రైట్స్ ను రూ.20 కోట్లకు అమ్మినట్టు తెలుస్తోంది.
కన్నప్ప 8 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
మొదటి రోజు కన్నప్ప చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.13 కోట్ల గ్రాస్ వసూలైంది. 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35 కోట్లు వసూళ్లు చేసింది. ఇక శుక్రవారంతో ఈ చిత్రం 2వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో 8వ రోజు కేవలం రూ.35 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. ఇక 2వ వీకెండ్ కు కన్నప్ప చిత్రం ఎంత వసూల్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ 2వ వీకెండ్ కన్నప్ప చిత్రానికి ప్రధానంగా మారింది. ఇక 8వ రోజు కేవలం 16.77 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
వరల్డ్ వైడ్ గా రూ.40కోట్లు మాత్రమే..
కన్నప్ప చిత్రానికి 8వ రోజు వరకు ఇండియా నెట్ రూ.30.55 కోట్లు మాత్రమే వసూలైందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఇండియా గ్రాస్ రూ.35.45 కోట్లు సాధించింది. ఓవర్సీస్ లో రూ.5.05 కోట్లు వసూలైంది. ఇక ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని ఈ చిత్రానికి రూ.40.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం రూ.140 కోట్ల వరకు తిరిగి రాబట్టాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో 2వ వారంలో వచ్చే బాక్సాఫీస్ వసూళ్లు కన్నప్పకు కీలకం కానున్నాయి.


Click it and Unblock the Notifications











