Kannappa Box Office Day 9: కన్నప్ప 9 రోజుల కలెక్షన్లు.. మంచు విష్ణును దేవుడే కాపాడాలి.. పూర్తి వసూళ్లు ఇంతే!

మంచు ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి సారిగా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కన్నప్ప. ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపుదిద్దుకున్నది. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలో భారీ తారాగణం నటించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లపై ఆసక్తి నెలకొంది. 1వ వారంలో కాస్తా జోరుగానే వసూళ్లు సాధించినా.. 2వ వారంలో కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలో కన్నప్ప సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 9వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

కన్నప్ప బడ్జెట్ ఎంత?
మైథలాజీ ఫిల్మ్ గా కనప్ప రూపుదిద్దుకోవడంతో సినిమాను పూర్తిగా న్యూజిలాండ్ లోనే చిత్రీకరించారు. భారీ తారాగణాన్ని తీసుకున్నారు. టాప్ టెక్నీషియన్లతో పనిచేయడం, మరోవైపు హిందీలోని మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ తో దర్శకత్వం చేయించడం విశేషం. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఇక వీఎఫ్ఎక్స్, సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్ లు, ఇతర క్రాఫ్ట్స్ లోనూ నిపుణులు పనిచేయడంతో భారీగానే ఖర్చైంది. రెమ్యునరేషన్స్, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ కలుపుకొని రూ.120 కోట్లు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Kannappa Day 9 Box Office Collections Worldwide

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
మంచు ఫ్యామిలీ నుంచి భారీ బడ్జెట్ చిత్రం, ప్రభాస్ వంటి భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడం, అందులోనూ హిందూ పురాణాలను తెప్పే ఆధ్యాత్మిక చిత్రం కావడంతో సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.100లోపు కోట్ల లోపు బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని ఈ చిత్రం రూ.180 కోట్లు వసూళ్లు చేయాలని విలువ కట్టారు.

కన్నప్ప 9 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
ఓపెనింగ్ రోజు రూ.13 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35, 8వ రోజు రూ.70 లక్షలు వసూల్ చేసింది. ఇక 9వ రోజు రూ.59 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసింది. అది కూడా కేవలం తెలుగు స్టేట్స్ లోనే అందాయి. మిగితా భాషల్లో వసూళ్లు ఆగిపోయాయి. ఇలా 9వ రోజుతో ఇండియా నెట్ రూ.31.22 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలుపుకొని రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

ఎంత శాతం రికవరీ అయ్యింది?
కన్నప్ప చిత్రానికి థియేటర్ ఆక్యుపెన్సీ భారీగా తగ్గిపోయింది. 9వ రోజు కేవలం 24.19 శాతం ఓవరాల్ గా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. అది కూడా తెలుగులోనే. 2వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కన్నప్ప చిత్రం వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి. ప్రస్తుతం లక్షల్లోనే వసూళ్లు అందుతున్నాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 25 నుంచి 30 శాతం మాత్రమే రికవరీ అయ్యిందని తాజా ట్రేడ్ లెక్కలు తెలుపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X