Kannappa Closing Collections : కన్నప్ప క్లోజింగ్ కలెక్షన్లు.. మంచు విష్ణు మూవీ హిట్టా? ఫట్టా?
తొలిసారిగా మంచు ఫ్యామిలీలో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న చిత్రం కన్నప్ప. కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కన్నప్ప చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. తిన్నడు పాత్రలో మంచు విష్ణు నటించారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఫిల్మ్ గా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా జూన్ 27న విడుదల చేశారు. ఈ క్రమంలో కన్నప్ప సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? మంచు విష్ణు సినిమాకు ఎన్ని కోట్లు నష్టం వచ్చిందనేది వివరాల్లోకి వెళితే..
కన్నప్ప బడ్జెట్ ఎంత?
హిందూ మైథలాజికల్ చిత్రంగా, భారీ విజువల్స్ తో కన్నప్ప చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి హిందీ మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించడం విశేషం. మరోవైపు భారీ తారాగణం ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేశారు. అలాగే పూర్తి సినిమాను న్యూజిలాండ్ లోని 7 ఎకరాల్లో చిత్రీకరించడం విశేషం. దీంతో మోహన్ బాబు భారీగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. చిత్ర నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రచార కార్యక్రమాల ఖర్చులన్నీ కలుపుకొని కన్నప్ప చిత్రానికి రూ.120 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

కన్నప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ప్రతి భాష నుంచి టాప్ స్టార్ నటించడం, పైగా హిందూ పురాణాలను చెప్పిన చిత్రం కావడంతో కన్నప్ప సినిమాకు ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, హిందీలో జయంతీలాల్ గడా, కర్ణాటకలో రాక్‌లైన్ వెంకటేష్, కేరళలో మోహన్ లాల్‌కి చెందిన ఆశీర్వాద్ పిక్చర్స్, నార్త్ అమెరికాలో వసారా ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో డీఎంవై క్రియేషన్స్ సంస్థలు రిలీజ్ చేశాయి. తెలుగు స్టేట్స్ 650, ఇండియాలో 4000, ఓవర్సీస్ లో 600 థియేటర్లలో విడుదల చేశారు. ఇలా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 5250 థియేటర్లలో విడుదలైంది. ఇక కన్నప్ప చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
కన్నప్ప ఇండియా నెట్, గ్రాస్ వసూళ్లు..
మంచు విష్ణు కన్నప్ప చిత్రం విడుదలై 17 రోజులు పూర్తైంది. ఈ సందర్భంగా ఇండియాలో బాక్సాఫీస్ వసూళ్లు ఇలా ఉన్నాయి. ఓపెనింగ్ డే రూ.13 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.9 కోట్లు, 4వ రోజు రూ.3 కోట్లు, 5వ రోజు రూ.2.5 కోట్లు, 6వ రోజు రూ.1.75 కోట్లు, 7వ రోజు రూ.1.35, 8వ రోజు రూ.70 లక్షలు, 9వ రోజు రూ.75 లక్షలు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక 10వ రోజు రూ.68 లక్షలు, 11వ రోజు రూ.22 లక్షలు, 12వ రోజు రూ.16 లక్షలు, 13వ రోజు రూ.15 లక్షలు, 14వ రోజు రూ.13, 15వ రోజు రూ.4 లక్షలు, 16వ రోజు రూ.4 లక్షలు, 17వ రోజు రూ.3 లక్షలు మాత్రమే ఇండియా నెట్ వసూలైంది.
కన్నప్ప ఓవర్సీస్ వసూళ్లు..
నార్త్ అమెరికా, మలేషియాలో కన్నప్ప చిత్రం భారీగా విడుదలైంది. మొదటి రోజు రూ.2 కోట్లు, 2వ రోజు రూ.1.60 కోట్లు, 3వ రోజు రూ.40 లక్షలు, 4వ రోజు రూ.30 లక్షలు, 5వ రోజు రూ.40 లక్షలు, 6వ రోజు రూ.15 లక్షలు, 7వ రోజు రూ.20 లక్షలు వసూల్ చేసింది. ఇక 2వ వారంలో రూ.5 లక్షలు వసూల్ చేసింది. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో రూ.5.10 కోట్లు వసూలైంది.
కన్నప్ప వరల్డ్ వైడ్ క్లోజింగ్ వసూళ్లు..
ఇక కన్నప్ప చిత్రం తెలుగు స్టేట్స్ లో రూ.26.98 కోట్లు నెట్, తమిళంలో రూ.77 లక్షలు, హిందీలో రూ.3.97 కోట్ల నెట్, కన్నడలో రూ.28 లక్షలు, మలయాళంలో రూ.73 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. ఇలా ఇండియా నెట్ రూ.32.73 కోట్ల వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలిపింది. ఇక ఇండియా గ్రాస్ రూ.36.81 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.41.91 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ గణాంకాలు తెలుపుతున్నాయి. మరోవైపు వరల్డ్ వైడ్ గా 50 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏదేమైనా ఈ లెక్కన్న కన్నప్ప చిత్రానికి రూ.130 కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా ఫైనల్ కాకపోవడం గమనార్హం. హిందీ శాటిలైట్ రైట్స్ ను రూ.20కోట్లకు అమ్మారు. దీంతో కన్నప్ప చిత్రం ఫైనల్ గా 110 కోట్ల రూపాయల నష్టాన్ని చూసింది.


Click it and Unblock the Notifications











