పుష్ప 2 స్థానంలో కన్నప్ప.. విష్ణు మూవీకి కళ్ళు చెదిరే బిజినెస్
ఒకప్పుడు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్, కలర్ లోకి సినిమాలు మారుతున్న సమయంలో మల్టీ స్టారర్ చిత్రాలు కూడా బిగ్ స్టార్స్ నడుమ కలిపి వచ్చేవి. కానీ నెమ్మదిగా కాలానుగుణంగా హీరోల తాలూకా స్పాన్ మార్కెట్ లు కూడా మారడంతో మల్టీ స్టారర్ చిత్రాలు దూరం అయ్యాయి. ఇలా ఓ మల్టీ స్టారర్ సినిమాని సెట్ చేయడం కూడా చాలా పెద్ద విషయంగా మారిపోయింది.
కాగా ఇలా కొన్ని చిత్రాలు మాత్రం కంటెంట్ నమ్ముకొని బిగ్ స్టార్స్ తో మళ్ళీ ఇప్పుడిప్పుడే భారీ చిత్రాలు మొదలవుతున్నాయి. కాగా మన తెలుగులోనే ఊహించని మల్టీ స్టారర్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తే అంతా వావ్ అనుకున్నారు. కానీ ఒక్క తెలుగు నుంచి కాదు టోటల్ పాన్ ఇండియా సినిమా నుంచే మంచు వారి హీరో కోసం హీరోలు హీరోయిన్లు కదిలారు.

మరి ఆ సినిమానే "కన్నప్ప". మంచు హీరో మంచు విష్ణు కథానాయకుడిగా టాలీవుడ్ లో ఐకానిక్ చిత్రం "భక్త కన్నప్ప" కి ప్రస్తుత జెనరేషన్ తో కొత్త తరహా సినిమాగా ప్లాన్ చేసిన సినిమానే ఇది. కాగా ఈ చిత్రం తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ విష్ణు ప్రెజెంట్ చేసుకోగా దీనికోసం ఏకంగా తాను ఇండియా లోనే ఒకో ఇండస్ట్రీలో తన సినిమా కోసం రప్పించుకున్నాడు. దీనితో ప్రస్తుతానికి అయితే చాలామందికి నమ్మశక్యంగా లేకపోయినా ఈ సినిమానే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా నిలిచింది.
కాగా ఈ చిత్రంలో విష్ణు మంచు, పాన్ ఇండియా హీరో ప్రభాస్, కాజల్ అగర్వాల్, నయనతార, మళయాళ సినిమా నుంచి స్టార్ హీరో మోహన్ లాల్, తమిళ్ నుంచి శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేస్తుండగా బాలీవుడ్ నుంచి బిగ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇంతేనా ఈ సినిమా కోసం నార్త్ సౌత్ లో సెన్సేషనల్ హిట్ అయ్యిన సీరియల్ "మహాభారతం" దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ ని దింపాడు.

మరి ఇంతలా ప్లాన్ చేస్తున్న సినిమాకి ఎలాంటి బిజినెస్ జరుగుతుంది? అందుకు తగ్గట్టుగానే ఒక ఊహించని రికార్డు బిజినెస్ ఇండియాలో జరుగుతుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ అందరిలో ప్రభాస్ పేరు పెద్దది కావడంతో తన స్పేస్ చిన్నదే అయినప్పటికీ ఓవరాల్ గా కన్నప్ప 400 కోట్లకి పైగా బిజినెస్ ని చుట్టేస్తుందట. ఇది మాత్రం షాకింగ్ మొత్తం అనే చెప్పి తీరాలి.
ఇదే కాకుండా ఈ సినిమాకి ఊహించని ప్రీ రిలీజ్ ప్లానింగ్ కూడా చేస్తున్నారని టాక్. ఏపీలో ఏకంగా 10 లక్షల మందితో ఈ ఈవెంట్ ని ప్లాన్ చేయాలని చూస్తున్నారని, అందుకు మంచు ఫ్యామిలి స్పెషల్ ట్రాన్స్ పోర్ట్ కూడా పెడతారని క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ ఎంతవరకు నిజమో సినిమా విడుదల అయ్యాక బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఆగి చూడాల్సిందే.
కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నారని కూడా కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ కన్ఫర్మేషన్ తర్వాతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా అప్పటికే డిసెంబర్ లో ఫిక్స్ చేసింది వాయిదా వేస్తున్నట్టుగా గాసిప్స్ మొదలయ్యాయి. దీనితో ఈ భారీ మల్టీ స్టారర్ దెబ్బ కొడుతోంది అనే పుష్ప 2 వెనక్కి వెళ్ళింది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు..


Click it and Unblock the Notifications











