Kantara collections worldwide 250 కోట్ల ధమాకా.. దుమ్మురేపుతున్న రిషబ్ శెట్టి.. కేజీఎఫ్ రికార్డు బ్రేక్!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే బ్యానర్‌పై కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి, సప్తమీ గౌడ నటించిన కంతార చిత్రం మూడో వారంలో కూడా కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రం కన్నడలో 24వ రోజున, తెలుగులో 9వ రోజున కూడా అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కంతారా 9వ రోజు కలెక్షన్లు
కంతారా చిత్రం తెలుగులో 9వ రోజున సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 65 లక్షలు, సీడెడ్‌లో 17 లక్షలు, ఉత్తరాంధ్రలో 18 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 10 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, కృష్ణా జిల్లాలో 11 లక్షలు, నెల్లూరులో 6 లక్షలు వసూలు చేసింది. దాంతో 9వ రోజున 1.44 కోట్లు, 2.55 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

9 రోజుల కలెక్షన్లు ఇలా..
ఇక కంతారా చిత్రం గత 9 రోజుల్లో ఆంధ్రా, నైజాంలో సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 6 కోట్లకుపైగా సీడెడ్లో 1.77 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.82 కోట్లు, కోస్తాంధ్రలో 4 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 14 కోట్ల షేర్, 25 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఉత్తరాదిలో తడాఖా
కంతారా చిత్రం ఉత్తరాదిలో తడాఖా చూపిస్తున్నది. హిందీలో 10 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. రెండోవారం శుక్రవారం 2.05 కోట్లు, శనివారం 2.55 కోట్లు, ఆదివారం 2.65 కోట్లు సాధించింది. దాంతో గత 10 రోజుల్లో 22.25 కోట్ల షేర్ రాబట్టింది.

కన్నడలో రికార్డు కలెక్షన్లు
ఇక కంతారా చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల పరిస్థితిని చూస్తే.. తొలి వారంలో కన్నడ వెర్షన్ 34 కోట్లు రెండోవారంలో 46.42 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మూడో వారంలో 39.6 కోట్లు వసూలు చేసింది. నాలుగో వారంలో ఈ చిత్రం ఇప్పటి వరకు 135.17 కోట్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 254 కోట్ల వసూళ్లను రాబట్టింది. కన్నడలో 1 కోటి మంది చూసిన సినిమాగా ఘనతను సాధించింది. దీంతో కేజీఎఫ్ రికార్డును అధిగమించింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
కంతార వివిధ భాషల్లో రిలీజై ఇప్పటి వరకు సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. ఏపీ, నైజాంలో 25.83 కోట్లు, తమిళనాడులో 4 కోట్లు, కేరళలో 2.76 కోట్లు, ఇతర దేశాల్లో 29.19 కోట్లు సాధించింది. కన్నడలో ఈ చిత్రం 135 కోట్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











