Kantara 41 days collections: 350 కోట్లకు చేరువగా.. 50 రోజుల పండుగ రికార్డుపై..
సంచలన విజయం సాధించిన కంతారా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. సెప్టెంబర్ 30 తేదీన రిలీజైన ఈ చిత్రం 50 రోజుల పండుగను చేసుకొనేందుకు సిద్దమవుతున్నది. ఇప్పటికే 300 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకొన్న ఈ చిత్రం రికార్డు స్థాయి ల్యాండ్ మార్క్‌ను క్రియేటర్ చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమా 41 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గత ఆరువారాల్లో వసూళ్లు
కంతారా చిత్రం తొలి వారం 27 కోట్లు, రెండోవారం 38 కోట్లు, మూడో వారం 75 కోట్లు, నాలుగోవారం 70 కోట్లు, ఐదోవారం 65 కోట్లు సాధించింది. ఈ చిత్రం ఆరో వారంలో భారీ వసూస్లను సాధించింది. ఆరో వారంలో శుక్రవారం 5 కోట్లు, శనివారం 9 కోట్లు, ఆదివారం 12 కోట్లు వసూలు చేసింది.

26వ రోజున తెలుగులో
తెలుగులో కంతారా చిత్రం 26వ రోజున ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. నైజాంలో 8 లక్షలు, సీడెడ్‌లో 2 లక్షలు, ఉత్తరాంధ్రలో 3 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షలు, గుంటూరులో 1 లక్ష, పశ్చి మ గోదావరి జిల్లాలో 1 లక్ష, కృష్ణా జల్లాలో 1 లక్ష, నెల్లూరు జిల్లాలో 1 లక్ష వసూలు చేసింది.

మొత్తం 26 రోజుల్లో వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో గత 26 రోజుల్లో కంతారా సాధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 12.35 కోట్లు, సీడెడ్‌లో 3.06 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.49 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.25 కోట్లు, గుంటూరులో 1.66 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.62 కోట్లు, నెల్లూరులో 94 లక్షలు వసూలు చేసింది.

రాష్ట్రాల వారీగా కలెక్షన్లు
కంతరా చిత్రం పలు రాష్ట్రాల్లో గత 40 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో 157 కోట్లు, తెలంగాణలో 52 కోట్లు, తమిళనాడులో 8 కోట్లు, కేరళలో 13 కోట్లు, ఉత్తరాంధ్రలో 74 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల వసూళ్లను నమోదు చేసింది.

హిందీలో 27 రోజుల కలెక్షన్లు
కంతార చిత్రం హిందీలో 27వ రోజున కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 2.60 కోట్లు రాబట్టింది. ఉత్తరాదిలో బలమైన వసూళ్లు లేకపోవడం వల్ల కంతార సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా అందరి అంచనాల తలకిందులు చేస్తూ.. 70 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్టు
ఇదిలా ఉంటే.. కంతార చిత్రం అమెరికాలో స్థిరంగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో కలిపి 2 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తెలుగులో 1 మిలియన్ డాలర్లు, కన్నడ భాషల్లో 1.2 మిలియన్ డాలర్లను సాధించింది. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 320 కోట్లకు చేరువైంది. త్వరలోనే ఈ చిత్రం 350 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











