Katanra Chapter 1 Business Woldwide: కాంతార చాప్టర్ 1 వరల్డ్ వైడ్ బిజినెస్ ఎన్ని కోట్లు? బ్రేక్ ఈవెన్ టార్గెట్
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు.
ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కంతార చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై బిజినెస్ పరంగాను, కంటెంట్ పరంగాను అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ వివరాల్లోకి వెళితే..

కాంతార చాప్టర్ 1 సినిమాను సుమారుగా 30 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా యూకేలోనే 100 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను కేరళలో పృథ్వీరాజ్ సుకుమారన్, నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, అమెరికాలో ప్రత్యాంగీరా సినిమాస్, యూకేలో డ్రీమ్స్, ఇతర దేశాల్లో ఫార్స్ ఫిల్మ్స్, ఆస్ట్రేలియాలో డ్రీమ్ స్క్రీన్స్ ఇంటర్నేషనల్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి.
కాంతార చాప్టర్ 1 చిత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను 125 కోట్ల రూపాయలు చెల్లించి అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకొన్నది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక మ్యూజిక్ రైట్స్ 30 కోట్ల రూపాయల మేర అమ్మకం జరిగింది. దాంతో ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ 235 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కాంతర చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబట్టడంతో కాంతార చాప్టర్ 1 సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాం థియేట్రికల్ హక్కులు 40 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 45 కోట్ల రూపాయలు, సీడెడ్ 15 కోట్ రూపాయల మేర అమ్ముడుపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 170 కోట్ల రూపాయల మేర వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఇక తెలుగేతర రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక హక్కులు రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 850 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











