Kantara Chapter 1 Day 1 Collections: కాంతార చాప్టర్ 1 తొలి రోజు బాక్సాఫీస్ జోరు.. రిషబ్ శెట్టి మూవీకి ఎన్ని కో

దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కంతార చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై బిజినెస్ పరంగాను, కంటెంట్ పరంగాను అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ వివరాల్లోకి వెళితే..

కాంతార చాప్టర్ 1 సినిమాను సుమారుగా 30 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా యూకేలోనే 100 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను కేరళలో పృథ్వీరాజ్ సుకుమారన్, నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, అమెరికాలో ప్రత్యాంగీరా సినిమాస్, యూకేలో డ్రీమ్స్, ఇతర దేశాల్లో ఫార్స్ ఫిల్మ్స్, ఆస్ట్రేలియాలో డ్రీమ్ స్క్రీన్స్ ఇంటర్నేషనల్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి.

Kantara Chapter 1 Day 1 Expected Box Office

కాంతర చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబట్టడంతో కాంతార చాప్టర్ 1 సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాం థియేట్రికల్ హక్కులు 40 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 45 కోట్ల రూపాయలు, సీడెడ్ 15 కోట్ రూపాయల మేర అమ్ముడుపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 170 కోట్ల రూపాయల మేర వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఇక తెలుగేతర రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక హక్కులు రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 850 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ సినిమా ప్రీ సేల్స్ ద్వారా భారీగానే వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో 35 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 40 కోట్ల రూపాయలకుపైగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ సినిమా కలెక్షన్లను రాబట్టింది.

కాంతార మూవీ రిలీజ్ తర్వాత మధ్యాహ్నం వరకు అందిన ట్రేడ్ రిపోర్టు ప్రకారం.. ఈ సినిమా కన్నడలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 3 కోట్ల రూపాయలు, మలయాళంలో 50 లక్షలు, తమిళంలో 1 కోటి రూపాయలు, హిందీలో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మౌత్ టాక్ పాజిటివ్‌గా స్ప్రెడ్ అయిన కారణంగా భారీగా తొలి రోజు కలెక్షన్లను నమోదు చేసింది.

కాంతార చాప్టర్ 1 తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా కన్నడలో 18 కోట్ల రూపాయలు, తెలుగులో 12.5 కోట్ల రూపాయలు, హిందీలో 20 కోట్ల రూపాయలు, తమిళంలో 5.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 500K, తొలి రోజు 200K డాలర్లు కలిపి 700K డాలర్లు అంటే.. 6.21 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఇండియా, నార్త్ అమెరికాలో కలిపి 66.21 కోట్లు వసూలు చేసింది. మిగితా దేశాల్లో కలెక్షన్లు అందాల్సి ఉంది. మొత్తంగా తొలి రోజు 80 కోట్ల రూపాయలు వరకు వసూలు చేయడానికి ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X