twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kantara 20 days collections: అందరికి లాభాలే.. తెలుగులో ఇప్పటివరకు ఎంత వచ్చాయంటే?

    |

    ఎక్కడ చూసినా ఇప్పుడు కాంతార సినిమా గురించి అనేక రకాల విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాను పెద్దగా అంచనాలు లేకుండానే విడుదల చేసిన నిర్మాతలకు అయితే ఇప్పుడు అన్ని వైపుల నుంచి లాభాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా లాభాలను గట్టిగానే అందుకుంటున్నారు. ఇక మొత్తంగా ఈ సినిమా కన్నడలో విడుదలై 20 రోజులు పూర్తయింది. ఇక తెలుగులో విడుదల ఐదు రోజులు పూర్తయింది. ఇక మొత్తంగా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

    బడ్జెట్ ఎంతంటే?

    బడ్జెట్ ఎంతంటే?

    రిషబ్ శెట్టి దర్శకుడిగానే కాకుండా సినిమాలో నటుడిగా కూడా ఎంతగానో మెప్పించాడు. అతను ఇలాంటి సినిమా చేస్తాడు అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా బ్యూటిఫుల్ యూత్ సినిమాలు మాత్రమే. ఇక కాంతార సినిమా సెప్టెంబర్ 30వ తేదీన భారీ స్థాయిలో కన్నడలో విడుదలైంది. ఈ సినిమాకు కేవలం 18 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కన్నడలో మొదటి వారంలోనే ఆ టార్గెట్ ను పూర్తి చేసింది.

    తెలుగు బిజినెస్

    తెలుగు బిజినెస్

    కాంతార సినిమా తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విడుదల చేశారు. ఈ సినిమాను మొదట తెలుగులో విడుదల చేయడానికి కొందరు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అల్లు అరవింద్ మాత్రం సినిమాలో కంటెంట్ ను నమ్మి మొదట కొన్ని లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేశారు. ఇక తర్వాత రోజురోజుకు థియేటర్లో సంఖ్యను పెంచుకుంటూ. వెళ్లారు ఇక ఈ సినిమా తెలుగులో 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్చెట్ తో వచ్చింది.

    5వ రోజు వచ్చిన కలెక్షన్లు

    5వ రోజు వచ్చిన కలెక్షన్లు

    కాంతార సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 5వ రోజు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా ఏరియాలో కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 62 లక్షలు సీడెడ్ లో 17 లక్షలు, ఉత్తరాంధ్రలో 18 లక్షలు, ఈస్ట్ లో 10 లక్షలు, వెస్ట్ లో 7 లక్షలు, గుంటూరులో 8 లక్షలు, కృష్ణ లో 9 లక్షలు, నెల్లూరులో 5 లక్షలు ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 5 రోజుల్లో కాంతార సినిమా 1.36 కోట్ల షేర్ కలెక్షన్స్ తో పాటు 2.25 కోట్ల గ్రాస్ ను అందుకుంది.

    తెలుగులో మొత్తం కలెక్షన్స్

    తెలుగులో మొత్తం కలెక్షన్స్

    ఇక కాంతార సినిమా మొత్తంగా ఐదు రోజుల్లో ఏపీ తెలంగాణలో అందుకున్న కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే నైజాంలో 4.22 కోట్లు, సీడెడ్ లో 1. 27 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.24 కోట్లు, ఈస్ట్ లో 80 లక్షలు, వెస్ట్ లో 49 లక్షలు, గుంటూరులో 62 లక్షలు, కృష్ణ లో 57 లక్షలు, నెల్లూరులో 40 లక్షలు ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టోటల్ 5 రోజుల్లో 9.61 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇక 18.25 కోట్ల దక్కింది.

    తెలుగు ప్రాఫిట్స్ ఎంతంటే..

    తెలుగు ప్రాఫిట్స్ ఎంతంటే..

    కాంతార సినిమా తెలుగులో మొత్తంగా రెండు కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ వద్ద గేమ్ స్టార్ట్ చేసిన కాంతార మొత్తంగా ఐదు రోజుల్లో అయితే ఏపీ తెలంగాణలో తెలుగు భాషలో 9.61 కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుంది. అంటే సినిమా పెట్టిన పెట్టుబడికి 7.31 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే అందించింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కాంతార సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. హిందీలో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కన్నడ భాషలో కలుపుకొని మొత్తం 20వ రోజు 7.5 కలెక్షన్స్ అందుకుంది. అంటే ఇప్పటివరకు టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 133.8 కోట్ల షేర్, 157.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

    English summary
    Kantara movie 20 days total worldwide box office collections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X