Kantara collections: 350 కోట్లపై కన్నేసిన రిషబ్ శెట్టి.. తగ్గని కంతార కలెక్షన్ల జోరు!
రిషబ్ శెట్టి నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన కంతార చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఐదో వారంలో కూడా కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగుతున్నది. హిందీ, తెలుగు, కన్నడ అనే తేడా లేకుండా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో కంతార చిత్రం కన్నడ 34 రోజులు, హిందీలో 20వ రోజు, తెలుగులో 19వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హిందీలో 50 కోట్లు
కంతార చిత్రం ఉత్తరాదిలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్నది. ఇటీవల రిలీజైన అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి హీరోల సినిమాల కంటే ఎక్కువగా వసూళ్లను రాబడుతున్నది. హిందీ వెర్షన్ కంతార గత 20 రోజుల్లో 50 కోట్లను రాబట్టింది. ఈ చిత్రం కేజీఎఫ్ 1 సినిమా వసూళ్లను అధిగమించింది. ఇంకా బలంగా బాక్సాఫీస్ వద్ద నిలవడమే కాకుండా నిలకడగా వసూళ్లను రాబట్టడం గమనార్హం.

మూడు వారాల్లో కంతార హిందీ..
కంతార హిందీ వెర్షన్ మూడో వారంలో కూడా బలంగా వసూళ్లను నమోదు చేస్తున్నది. మూడో వారంలో శుక్రవారం 2.75 కోట్లు, శనివారం 4.10 కోట్లు, ఆదివారం 4.40 కోట్లు, సోమవారం 2.30 కోట్లు, మంగళవారం 2.30 కోట్లుతో మొత్తంగా 47.55 కోట్లు నమోదు చేసింది. బుధవారం రోజున 1.9 కోట్లు రాబట్టడంతో 50 కోట్ల క్లబ్‌లో చేరింది.

కన్నడ వెర్షన్ జైత్రయాత్ర
కన్నడ వెర్షన్ కంతార విషయానికి వస్తే.. తొలివారం 30.3 కోట్లు, రెండోవారం 42.3 కోట్లు, మూడో వారం 34 కోట్లు, నాలుగు 28 కోట్లు వసూలు చేసింది. ఐదోవారంలో తొలి రోజు 1.43 కోట్లు, రెండో రోజు 2.47 కోట్లు, మూడో రోజు 3.5 కోట్లు, నాలుగు 1.4 కోట్లు, మంగళవారం 3.05 కోట్లు, బుధవారం 91 లక్షలు వసూలు చేసింది.

తెలుగులో నిలకడగా 50 కోట్లు
తెలుగు వెర్షన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణలో 23 కోట్లు షేర్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక 19వ రోజు 1 కోటి రూపాయల కలెక్షన్లు నమోదు చేసింది. ఇంకా స్ట్రాంగ్‌గా ఈ సినిమా కలెక్షన్లను రాబడుతున్నది. తెలుగులో ఇప్పటికే 20 కోట్లకుపైగా లాభాలను సాధించింది.

యూఎస్‌లో కూడా భారీగా
కంతార చిత్రం యూఎస్‌లో కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నది. అమెరికాలో 1.8 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. ఈ వారం ముగిసే సమయానికి 2 మిలియన్ల డాలర్ల క్లబ్‌లో చేరేందుకు రెడీ అయింది. అమెరికాలో ఇంకా 200 స్క్రీన్లలో ప్రదర్శించబడుతున్నది. ఈ సినిమా అమెరికాలో 2.5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దేశవ్యాప్తంగా వసూళ్లు ఇలా...
ఇక దేశవ్యాప్తంగా కంతారా వసూళ్లను పరిశీలిస్తే.. ఐదో వారంలో శుక్రవారం 5.65 కోట్లు, శనివారం 10.55 కోట్లు, ఆదివారం 12.9 కోట్లు, సోమవారం 5.73 కోట్లు, మంగళవారం 7.21 కోట్లు, బుధవారం 4.36 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 300 కోట్లకు చేరువైంది.


Click it and Unblock the Notifications











