Kantara Closing Collections కలెక్షన్ల చరిత్ర సృష్టించిన కంతార.. 16 కోట్లు బడ్జెట్.. ఎంతొచ్చిందంటే?

కంతార చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది. దేశవ్యాప్తంగా పెద్దగా ప్రమోషన్ చేపట్టకున్నా మౌత్ టాక్‌తోనే రిషబ్ శెట్టి నటించిన ఈ చిత్రం రికార్డులు తిరగరాసింది. చిన్న చిత్రంగా రిలీజై భారీగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

 50 రోజుల పాటు ఏకధాటిగా

50 రోజుల పాటు ఏకధాటిగా


కన్నడ చిత్ర సీమలో కేజీఎఫ్2, విక్రాంత్ రోణ తర్వాత అంతటి విజయాన్ని సాధించిన చిత్రం కంతార. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 50 రోజులపాటు ఏకధాటిగా అన్ని భాషల్లోను ఆడింది. ఇటీవల కాలంలో అర్ధశతదినోత్సవం జరుపుకొన్న చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.

 దక్షిణాదిలో కలెక్షన్ల కుంభవర్షం

దక్షిణాదిలో కలెక్షన్ల కుంభవర్షం


కంతార చిత్రానికి కన్నడ రాష్ట్రంలో జేజేలు పలికారు. ఈ చిత్రం ఏకంగా కన్నడ వెర్షన్ 168.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్రాలో 60 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో 12.7 కోట్లు, కేరళలో 19.2 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా దక్షిణాదిలో 260 కోట్ల వసూళ్లు సాధించింది.

ఉత్తర భారతంలోను వసూళ్ల సునామీ

ఉత్తర భారతంలోను వసూళ్ల సునామీ


ఇక ఉత్తర భారతంలో వారం రోజులు ఆలస్యంగా రిలీజైన కంతార చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే సక్సెస్‌ఫుల్‌గా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఉత్తర భారత దేశంలో సుమారు 100 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. కంటెంట్ బాగుంటే.. భాషతో సంబంధం లేదనే విషయాన్ని కంతార నిరూపించింది.

ఓవర్సీస్‌లో కంతారా జైత్రయాత్ర

ఓవర్సీస్‌లో కంతారా జైత్రయాత్ర


కంతార చిత్రం ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు రాబట్టింది. ఉత్తర అమెరికాలో 17.7 కోట్లు, ఆస్ట్రేలియాలో 2.62 కోట్లు, న్యూజిలాండ్‌లో 19.9 కోట్లు, యూకేలో 1.46 కోట్లు, యూఏఈలో 6.52 కోట్లు, మిగితా అరబ్ దేశాల్లో3.3 కోట్లు, ఇతర దేశాల్లో 2.5 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మొత్తంగా మొత్తం 44.3 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కంతార ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా కంతార ఎంతంటే?


ప్రపంచవ్యాప్తంగా కంతారా కలెక్షన్లను పరిశీలిస్తే.. దక్షిణాదిలో 260 కోట్లకుపైగా, ఉత్తరాదిలో 100 కోట్లు, ఓవర్సీస్‌లో 45 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక కంతార చిత్రం 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 400 కోట్లతో కనకవర్షం కురిపించింది.

 ఓటీటీలోకి కంతార మూవీ ఎప్పుడంటే?

ఓటీటీలోకి కంతార మూవీ ఎప్పుడంటే?

కేజీఎఫ్ లాంటి చిత్రాలను రూపొందించిన హోంబలే ఫిలింస్ రూపొందించిన కంతార మూవీ థియేట్రికల్‌గా దుమ్ము రేపింది. దాదాపు 50 రోజుల అనంతరం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. నవంబర్ 24 తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X