Kantara movie day 1 collections రిషబ్ శెట్టి మూవీకి సూపర్ టాక్.. కలెక్షన్లలో అదే మైనస్!
కన్నడ సినిమా పరిశ్రమ క్వాలిటీతో కూడిన సినిమాలు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొనే చిత్రాల రూపకల్పన భారీగా జరుగుతున్నది. కేజీఎఫ్ తర్వాత చార్లీ 777, విక్రమ్ రోణ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాల తర్వాత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం Kantara. ప్రమోషన్స్, పబ్లిసిటీ, ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే..

కేజీఎఫ్ మూవీ మేకర్స్ నుంచి
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కంటారా చిత్రాన్ని హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. సుమారు 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా తొలి ఆట నుంచే భారీ టాక్‌ను సొంతం చేసుకొన్నది.

కన్నడ భాషలోనే రిలీజ్
అయితే కంటారా చిత్రం కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ అయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో కన్నడ వెర్షన్ ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేయకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. అయినా రిషబ్ శెట్టి ఫ్యాన్స్ కన్నడ వెర్షన్‌తో సరిపెట్టుకొంటున్నారు.

కర్ణాటకలో అక్యుపెన్సీ
కంటారా సినిమా కర్ణాటకలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కన్నడ ప్రాంతంలో కండుపురలో 65 శాతం, శివమొగ 54 శాతం, మణిపాల్ 70 శాతం అక్యుపెన్సీ సాధించింది. మైసూర్‌లో 30 శాతం, బెంగళూరులో 40 శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది. గుల్బర్గా, మంగళూరులో 35 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉందంటే?
అయితే ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన కంటారా సినిమా కన్నడ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 35 లక్షల అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దేశవ్యాప్తంగా 15 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే తొలి రోజు మౌత్ టాక్ పెరగడంతో రెండో రోజు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. వారాంతంలో బాక్సాఫీస్ వద్ద వసూల్లు ఊపందుకొనే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఎంతంటే?
కంటారా సింగిల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ కావడం వల్ల భారీగా కలెక్షన్లు నమోదు చేయలేకపోయిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 4 నుంచి 5 కోట్ల వరకు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











