Kantara 18 days collections కంతార కలెక్షన్ల దుమారం.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంతంటే?
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కంతారా చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో శివాలెత్తుతున్నది. సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ చిత్రంగా రిలీజైన ఈ సినిమా గతవారం వివిధ భాషల్లోకి డబ్ అయి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నది. మూడోవారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తూ రికార్డు కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతున్నది. ఈ సినిమా 18వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కన్నడలోనే 100 కోట్లు
కంతారా చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తున్నది. కన్నడ వెర్షన్ తొలి వారం 30 కోట్లకుపైగా, రెండోవారంలో 42.3 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక మూడోవారంలో 15వ రోజున కన్నడలో 4.27 కోట్లు, 16 రోజున 8.05 కోట్లు, 18వ రోజు 9.35 కోట్లు, 18వ రోజున 3.73 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దాంతో కన్నడ వెర్షన్ 100 కోట్లు షేర్ రాబట్టింది.

హిందీలో నిలకడగా కలెక్షన్లు
కంతార హిందీ వెర్షన్ అక్టోబర్ 14వ తేదీన ఉత్తరాదిలో విడుదలైంది. తొలి రోజున 1.27 కోట్లు, రెండో రోజున 2.75 కోట్లు, మూడో రోజున 3.5 కోట్లు, నాలుగో రోజున 1.41 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం 9 కోట్ల షేర్, సుమారు 16 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తెలుగులో భారీ వసూళ్లు
ఇక తెలుగులో అక్టోబర్ 15వ తేదీన రిలీజైన కంతారా చిత్రంలో బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్నది. తొలి రోజున తెలుగులో 3.2 కోట్లు, రెండో రోజున 4.8 కోట్లు, మూడో రోజున 2.51 కోట్ల షేర్ సాధించింది. గత రెండు రోజుల్లో 11.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మూడో రోజున మరో 3.7 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొత్తంగా 15 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

ఓవర్సీస్‌లో కన్నడ రికార్డు
దేశవ్యాప్తంగానే కాకుండా కంతారా చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 1.48 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు 12 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో కన్నడ చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?
కంతారా చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కన్నడలో 100 కోట్లకుపైగా షేర్, తెలుగులో 12 కోట్ల షేర్, 15 కోట్లకుపైగా గ్రాస్, హిందీలో 1.41 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 120 కోట్ల షేర్, దాదాపు 150 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











