Kantara 19 days collections కేజీఎఫ్ మూవీకి ధీటుగా కలెక్షన్లు.. అన్నిచోట్ల కలెక్షన్ల మోత.. 200 కోట్లకు చేరువగా!

కంతార మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ అయిన ఈ చిత్రం రిలీజైన ప్రతీ చోట కలెక్షల వర్షం కురిపిస్తున్నది. వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా దండిగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఇప్పటికే 150 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే దూకుడు ప్రదర్శిస్తున్నది. ఈ చిత్రం 19వ రోజున ఎంత వసూలు చేసిందనే విషయంలోకి వెళితే..

ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు

ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు

ఓవర్సీస్‌లో కంతారా చిత్రం భారీగా వసూళ్లను రాబడుతున్నది. గత రెండు వారాల్లో పెద్దగా ప్రభావం చూపలేని ఈ సినిమా మూడో వారం నుంచి కలెక్షన్ల ఊపు కనిపిసున్నది. ఓవర్సీస్‌లో 1.8 మిలియన్ల వసూళ్లను రాబట్టింది. త్వరలోనే 2 మిలియన్ డాలర్ల వసూళ్లను నమోదు చేయడానికి పరుగులు పెడుతున్నది.

అమెరికా, జర్మనీలో

అమెరికా, జర్మనీలో

అమెరికాలో కంతారా చిత్రం 700k వసూళ్లను నమోదు చేసింది. గతంలో రెండు వారాల్లో కేజీఎఫ్ చిత్రం 805k కలెక్ట్ చేసింది. కేజీఎఫ్‌కు సమానంగా ఈ సినిమా ఓవర్సీస్‌లో వసూళ్లను రాబడుతున్నది. ఇక జర్మనీలో రికార్డు స్థాయి వసూళ్లను ఈ సినిమా వసూలు చేసింది. కేజీఎఫ్2 మూవీ $36591.24 డాలర్లను వసూలు చేస్తే.. కంతార సినిమా $668K వసూళ్లను రాబట్టింది.

ఇండియా వైడ్‌గా కలెక్షన్లు

ఇండియా వైడ్‌గా కలెక్షన్లు

ఇక ఇండియావైడ్‌గా కంతారా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 152 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ చిత్రం తొలి రోజున 1.27 కోట్లు, రెండో రోజున 2.75 కోట్లు, మూడో రోజున 3.5 కోట్లు, నాలుగో రోజున 1.75 కోట్లు వసూలు చేసింది. హిందీలో మొత్తంగా 9.27 కోట్లు రాబట్టింది.

కన్నడలో కేజీఎఫ్‌తో పోటీ

కన్నడలో కేజీఎఫ్‌తో పోటీ

కన్నడలో కంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నది. తొలివారం 30.3 కోట్లు, రెండో వారం 42.3 కోట్లు సాధించింది. ఇక మూడో వారంలో ఇప్పటి వరకు 25 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్లకు చేరువైంది. కన్నడలో కేజీఎఫ్‌2 సినిమా కలెక్షన్లకు ధీటుగా వసూళ్లను సాధిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో లాభాల పంట

తెలుగు రాష్ట్రాల్లో లాభాల పంట

ఇక తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాం, ఆంధ్రాలో మెరుగైన వసూళ్లను రాబడుతున్నది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం 11.5 కోట్లు వసూలు చేసింది. నైజాంలో మూడు కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తే. ఆంధ్రాలో 4 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో 2 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశించడం రికార్డుగా మారింది.

19వ రోజు కలెక్షన్లు ఇలా..

19వ రోజు కలెక్షన్లు ఇలా..

కంతార చిత్రం 19వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. కన్నడలో ఈ చిత్రం 3.41 కోట్లు, హిందీలో 1.82 కోట్లు, తెలుగులో 3.03 కోట్ల షేర్, తమిళనాడులో 26 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 8.52 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

200 కోట్లకు చేరువగా

200 కోట్లకు చేరువగా

కంతారా చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా 150 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో ఇప్పటికే 20 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. రానున్న కాలంలో ఈ చిత్రం 250 నుంచి 300 కోట్ల మధ్య కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X