Kantara: తెలుగులో కాంతార మరో రికార్డ్.. శాటిలైట్ రైట్స్ ఎంతంటే?
కన్నడలోనే పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అసలు ఈ సినిమా కన్నడలోనే ఓ మోస్తారుగా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహలకందని రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంది. ముఖ్యంగా కన్నడ లోనే అత్యధిక మంది జనాలు చూసిన సినిమాగా కూడా ఇది రికార్డును క్రియేట్ చేసింది. ఇక తెలుగులో కూడా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డబ్బింగ్ సినిమాల్లో కాంతార సినిమా టాప్ లిస్టులో చేరిపోయింది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
16 కోట్లతో బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 360 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. దీన్ని బట్టి సినిమా ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగులో అయితే రెండు రాష్ట్రాల్లో కాంతార సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇక ఆ రేంజ్ లో సక్సెస్ అయింది కాబట్టి సినిమా మిగతా నాన్ థియేట్రికల్ గా కూడా మంచి లాభాలు వచ్చి ఉంటాయి అని చెప్పవచ్చు.

ఇక తెలుగులో ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రముఖ చానల్స్ గట్టిగానే పోటీపడ్డాయి. ఇక ఫైనల్ గా స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా శాటిలైట్ డీల్ 4.5 కోట్ల రేంజ్ లో క్లోజ్ అయినట్లు సమాచారం. హిందీలో కూడా ఈ సినిమాకు మంచి డీల్స్ అయితే లభిస్తున్నాయి. ప్రస్తుతం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఓటీటీ డీల్ ప్రకారం అయితే ఇప్పటికే ఓటీటీలో సినిమా ప్రసారం కావాలి. కానీ నిర్మాతలు మరికొంత సమయం తీసుకొని ఓటీటీ లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక అమెజాన్ ప్రైమ్ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. మొదట కాంతర సినిమాను అమెజాన్ ప్రైమ్ పే పర్ వ్యూ పద్ధతిలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











