Kara Box Office: ధనుష్ మూవీ బాక్సాఫీస్ హిట్టా? ఫట్టా? కర మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
దక్షిణాదిలో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకొన్న తమిళ హీరో ధనుష్ నటించిన కర చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రంలో మమితా బైజు, కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరాం, పృథ్వీ పాండ్యరాజన్, సూరజ్ వెంజారమూడు, శ్రీజ రవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు.
యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్, సినిమాటోగ్రఫి: తేని ఈశ్వర్, ఎఢిటింగ్: శ్రీజిత్ సారంగ్, ఆర్ట్ డైరెక్టర్: మాయాపాండి తమ బాధ్యతలను నిర్వర్తించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు నిర్మాతగా డాక్టర్ ఇషారీ కే గణేష్, సహ నిర్మాతగా కుష్మిత గణేష్ వ్యవహరించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

రాబిన్ హుడ్ కాన్సెప్ట్, బ్యాక్ డ్రాప్‌తో బ్యాంకు లోన్లపై సెటైరిక్‌గా రూపొందిన కర చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలు ప్రధానంగా నిలిచాయి. ఈ చిత్రంలో స్టార్ నటీనటులు, టాప్ టెక్నిషియన్లు పనిచేశారు. వారి రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
ఈ సినిమా తమిళ, తెలుగు రాష్ట్రాల బిజినెస్ సుమారుగా 60 కోట్ల రూపాయలు మేర వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 60 కోట్ల షేర్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో వరల్డ్ వైడ్ సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లపై ప్రభావం భారీగానే పడింది అని ట్రేడ్ రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఇక కర సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 6.5 కోట్ల రూపాయల నెట్‌తో కలెక్షన్ల జర్నీని మొదలుపెట్టింది. రెండో రోజు 7 కోట్ల రూపాయలు, మూడో రోజు 5.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారంతంలో ఈ సినిమా 23 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది అని సాక్ నిక్ వెల్లడించింది. అయితే తొలి వారాంతం తర్వాత ఈ సినిమా వసూళ్లు భారీగా పడిపోయాయి. 5వ రోజు 1.8 కోట్లు, 6వ రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 26 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని తెలిపారు.
ఈ సినిమా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తమిళంలో 20 కోట్ల నెట్, తెలుగులో 5 కోట్ల రూపాయల వసూలు చేసింది. ఓవర్సీస్ ఈ మూవీ 10 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం మరో 5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 50 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా భారీగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications