Kara Closing Collections: కర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, యంగ్ హీరోయిన్ మమితా బైజు జంటగా నటించిన మూవీ కర. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ బ్యానర్‌పై ఇషారీ కే గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్వకత్వం వహించారు. కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ రాజన్, సూరజ్ వెంజారమూడు, శ్రీజ రవి తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహించగా.. థేనీ ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కర మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు కర మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ధనుష్ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనేది పరిశీలిస్తే..

నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి కర మూవీని దాదాపు 110 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 55 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో ధనుష్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కర మూవీని వరల్డ్ వైడ్‌గా 550 పైగా థియేటర్‌లలో విడుదల చేశారు.

Kara Box Office Collections Worldwide Dhanush s film Closing Collections at Global Box Office Report

కర కలెక్షన్స్
ధనుష్ మూవీకి ఇండియాలో తొలిరోజున 6.20 కోట్ల రూపాయలు, రెండో రోజున 6.95 కోట్ల రూపాయలు, మూడో రోజున 5.20 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.80 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.58 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.53 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 96 లక్షల రూపాయలు, పదో రోజున 1.18 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 1.33 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 77 లక్షల రూపాయలు, పదమూడో రోజున 81 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 80 లక్షల రూపాయలు చొప్పున రాబట్టింది. ఇండియాలో ఇప్పటి వరకు కర మూవీ 36.80 కోట్ల రూపాయల నెట్.. 42.35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ధనుష్ మూవీకి నార్త్ అమెరికా, గల్ఫ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో 1.11 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 10.55 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి కర మూవీకి వరల్డ్ వైడ్‌గా 54 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ధనుష్ మూవీ తమిళనాడులో 33.64 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల రూపాయలు, కేరళలో 69 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 31 లక్షల రూపాయలు చొప్పున రాబట్టింది.

కర మూవీకి లాభమెంత? నష్టమెంత?
భారీ అంచనాలతో భారీలోకి దిగిన కర సినిమాకు తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ధనుష్ క్రేజ్ సినిమాను కొంతమేరకు కాపాడింది. అయితే ఫస్ట్ వీకెండ్ ముగిసిన నాటి నుంచి కరకు కలెక్షన్స్ తగ్గుతూ క్రమేణా పడిపోయాయి. కర మూవీ లాభాల్లోకి రావాలంటే 55 కోట్ల రూపాయల షేర్ .. 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 54 కోట్ల రూపాయల గ్రాస్.. 28 కోట్ల రూపాయల షేర్ మాత్రమే అందుకుంది. దాంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా దాదాపు 25 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాడు ధనుష్.

ఇక కర సినిమా కోసం నిర్మాతలు దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేశారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో కేవలం 27 శాతం రికవరీ మాత్రమే సాధించి నిర్మాతలకు బడ్జెట్ పరంగా 45 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో హక్కుల ద్వారా నిర్మాత స్వల్ప నష్టాలతో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా కర సినిమాతో ధనుష్ తన అభిమానులను బాగా డిజప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు.

Read more about: box office report dhanush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X