Kara Movie Review: కర మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: ధనుష్, మమితా బైజు, కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరాం, పృథ్వీ పాండ్యరాజన్, సూరజ్ వెంజారమూడు, శ్రీజ రవి తదితరులు
దర్శకత్వం: విఘ్నేష్ రాజా
నిర్మాత: డాక్టర్ ఇషారీ కే గణేష్
సహ నిర్మాత: కుష్మిత గణేష్
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫి: తేని ఈశ్వర్
ఎఢిటింగ్: శ్రీజిత్ సారంగ్
ఆర్ట్ డైరెక్టర్: మాయాపాండి
బ్యానర్: వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2026-04-30

కర కథ ఏమిటంటే?
కర అలియాస్ కరస్వామి (ధనుష్) దోపిడిలు చేస్తూ దొంగగా జీవిస్తుంటాడు. ఎమ్మెల్యే ఇంటిలో దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కిన కర ఇక ముందు చోరీలకు పాల్పడవద్దని డిసైడ్ అవుతాడు. తన ప్రేమించి పెళ్లాడిన మల్లి (మమిత బైజు)తో కలిసి హోటల్‌లో పని చేస్తుంటాడు. అయితే కూలీగా పనిచేయడం కంటే.. సొంతంగా హోటల్ పెట్టుకోవాలని మల్లీ, కర నిర్ణయించుకొంటాడు. ఎప్పుడో దూరమైన తల్లిదండ్రులను కలిసి ఆర్థిక సహాయం పొందాలనుకొంటారు. సొంత ఊరికి వెళ్లి తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) కలిసే సమయానికి రైతుగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. బ్యాంక్ రుణాలు కట్టలేక ఆస్తులు జప్తు చేసే పరిస్థితిలో ఉంటాడు. ఆర్థిక కష్టాలను భరించలేక తండ్రి తన కళ్ల ముందే మరణించడాన్ని కర జీర్ణించుకోలేపోతాడు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తండ్రి దహన సంస్కారాలను బ్యాంక్ అధికారులు అడ్డుకొంటారు.

Kara Tamil Movie Review

కర మూవీలో ట్విస్టులు ఇలా?
కర ఇంట్లో నుంచి పారిపోయి ఎందుకు దొంగగా మారాడు? దొంగతనాలను ఎందుకు మానుకోవాలని అనుకొంటాడు? మల్లితో పెళ్లి విషయాన్ని తల్లిదండ్రుల వద్ద ఎందుకు దాచాడు? తండ్రి సంపాదించిన భూమిని తాకట్టు పెట్టి హోటల్‌ పెట్టాలని ప్లాన్ వేసిన తర్వాత ఏం జరిగింది? తండ్రితోపాటు ఆ ప్రాంత రైతులు బ్యాంకుల చేతిలో ఎలా మోసపోయారు? బ్యాంక్ రుణం కట్టలేక రైతులు ఎలా చితికి పోయారు? తండ్రి అంత్యక్రియలను బ్యాంక్ అధికారులు అడ్డుకొంటే కర రియాక్షన్ ఏమిటి? తండ్రి పార్థీవ దేహాన్ని అనాథ శవంగా ఎందుకు మార్చాడు? తండ్రి అంత్యక్రియలను జరిపించడానికి కర తీసుకొన్న నిర్ణయం ఏమిటి? తండ్రి మరణం నేపథ్యంలో మళ్లీ కర ఎందుకు దొంగగా మారాడు? బ్యాంక్ మేనేజర్ (జయరాం)తో విభేదాలు ఏమిటి? చివరకు తండ్రి అంత్యక్రియలను ఆయన కోరిక మేరకు కర జరిపించాడా? రైతులకు కర చేసిన మేలు ఏమిటి? నేరాలు చేసినప్పటికీ డీఎస్పీ భరతన్ (సూరజ్)ను కర ఎలా మెప్పించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

కర మూవీ అనాలిసిస్
అల్లరి చిల్లరిగా తిరుగుతూ దొంగతనాలు పాల్పడే యువకుడు రాబిన్‌హుడ్ తరహా ఎలా మారాడు అనే పాయింట్ చుట్టు అల్లుకొన్న తండ్రి, కొడుకుల కథనే కర. దర్శకుడు విఘ్నేష్ రాజా రాసుకొన్న బేసిక్ పాయింట్ చాలా బాగుంది. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషన్స్ చక్కగా ఉన్నాయి. కానీ ఎమోషన్స్ పట్టుకొని బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో కొంత ట్రాక్ మిస్ అయ్యాడనిపిస్తుంది. కథలో వేరియేషన్ లేకపోవడం వల్ల స్టోరీ అక్కడక్కడే తిరుగడం వల్ల కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి ప్రతికూలమైన పాయింట్స్‌ను ధనుష్, కేఎస్ రవికుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు పాజిటివ్‌గా మార్చేలా చేశాయి. లోన్ల విషయంలో బ్యాంకులు పాటించే విధానాలు సామాన్య జనాల జీవితాలకు ఉరిలా మారుతున్నాయి. జీవితాంతం రుణాలు కడుతూనే వారు ఆర్థికంగా ఎలా చితికిపోతున్నారనే పాయింట్‌ను కళ్లకు కట్టినట్టు చూపించాడు. బ్యాంక్ దోపిడిలు, పొలీసులకు, కర మద్య, అలాగే కర, బ్యాంక్ అధికారుల మధ్య ఉండే ఫైట్ పరంగా ఇంకా బలమైన సన్నివేశాలు రాసి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఏది ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ధనుష్‌ను చూడాలనే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

ధనుష్, మమితా బైజు ఎలా చేశారంటే?
కర టైటిల్ పాత్రలో ధనుష్ తనదైన రీతిలో పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. ఆయన నటన గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కర పాత్రలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తన యాక్టింగ్ టాలెంట్‌తో వాటిని కనిపించకుండా చేశాడు. మల్లీగా మమితా బైజుకు పెద్దగా స్కోప్ లేని పాత్ర లభించినప్పటికీ.. తనకు లభించిన స్క్రీన్ స్పేస్‌ను చక్కగా ఉపయోగించుకొన్నారు. కొన్ని సీన్లలో ధనుష్‌తో పోటీ పడి నటించింది. ఎస్ రవికుమార్ పాత్ర నిడివి చిన్నదైనా కథ ఆయన చుట్టే తిరుగుతుంది. డీఎస్పీగా భరతన్, బ్యాంక్ మేనేజర్‌గా జయరాం గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. మిగితా వారందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాను ఎమోషనల్‌గా మార్చడానికి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను జీవీ ప్రకాశ్ కుమార్ సమకూర్చాడు. రీరికార్డింగ్‌తో6 పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు. ఆడియోపరంగా పాటలు బాగలేపోయినా.. స్టోరి పరంగా, సిట్యుయేషనల్ పరంగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. తేనీ ఈశ్వర్ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె అందాలను బాగా తెరకెక్కించాడు. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఇంకా కొంత కఠినంగా వ్యవహరించాల్సిందనిపిస్తుంది. చాలా సన్నివేశాలు స్లోగా సాగుతాయి. డాక్టర్ ఇషారీ కే గణేష్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?
బ్యాంక్ లోన్లపై, బ్యాంక్ అధికారులు విధానాలపై సెటైరికల్‌గా డిఫరెంట్ ఐడియాతో రూపొందిన ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా. కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా రైతుల వెతలను, రుణాల బారిన పడి రైతుల జీవితాలు ఎలా విచ్చిన్నం అవుతున్నాయనే పాయింట్‌ను బాగా చూపించారు. ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేసే ఛాన్స్ ఉన్నా.. ఆ విషయంలో డైరెక్టర్ కొంత తడబాటు పడ్డారనే విషయం కనిపిస్తుంది. ఫస్టాఫ్ తండ్రి కొడుకుల భావోద్వేగాలు ఆకట్టుకొంటే.. సెకండాఫ్‌లో రాబిన్‌హుడ్ తరహా కాన్సెప్ట్ మెప్పించేలా ఉంటుంది. ధనుష్‌ను డిఫరెంట్‌గా మరోసారి చూడాలనుకొనే వారు ఈ సినిమాను ఈ వారం తమ ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు. ఓ డిఫరెంట్ అనుభూతిని పంచుతుంది.

Read more about: dhanush mamita baiju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X