డిజాస్టర్ దిశగా కరీనా కపూర్ మూవీ.. 40 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే?
హిందీ సినీ పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్, మహనా ఫిల్మ్స్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా కపూర్, కరీనా కపూర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది బకింగ్‌హమ్ మర్డర్స్. కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో కీత్ అలెన్, రణ్‌వీర్ బ్రార్ తదితరులు నటించారు. సెప్టెంబర్ 13వ తేదీన రిలీజైన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
బ్రిటన్‌లో ఇండియన్ డిటెక్టివ్ జస్మిత్ భమ్రా ఇటీవల 10 ఏళ్ల బిడ్డను కోల్పయింది. బకింగ్‌హమ్‌షైర్ జరిగిన హత్య సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు హన్సల్ మెహతా దర్శకత్వం వశహించారు. ఈ సినిమాకు టాలెంట్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ పని చేశారు. వారి రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ఇక ఈ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల తడబాటును ప్రదర్శించింది. ఈ చిత్రం మొదటి రోజు 1.25 కోట్లు, రెండో రోజు 2 కోట్ల రూపాయలు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 80 లక్ష్లలు, ఐదో రోజు 70 లక్షల రూపాయలు, ఆరో రోజు 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 7.3 కోట్ల రూపాయలు రాబట్టింది.

అయితే ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి బాక్సాఫీస్ వద్ద దయనీయంగా ఉంది. దాంతో తొలివారమే ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసే అవకాశాలు ఉన్నాయి.దాంతో ఈ చిత్రం దారుణమైన నష్టాలతో థియేట్రికల్ రన్ ముగిస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాదాపు ఈ సినిమా 30 కోట్లకుపైగా నష్టాలతో ముగిసే ఛాన్స్ ఉంది.
కరీనా కపూర్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఎన్నో వైవిధమైన పాత్రలను పోషించిన ఆమె ఈ సినిమాను సక్సెస్ బాట పట్టించలేకపోయింది. అయితే కరీనా పెర్ఫార్మెన్స్ మాత్రం మంచి ప్రశంసలుదక్కుతున్నాయి.


Click it and Unblock the Notifications











