ప్లాప్ టాక్..కలెక్షన్స్ టాప్
ముంబై : గతంలో 'చాందినీబార్', 'పేజ్3', 'ఫ్యాషన్' వంటి చిత్రాలతో తనదైన శైలిని ప్రదర్శించి తనకైన ప్రేక్షకులని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు మాధుర్ భండార్కర్ . ఆయన తాజా చిత్రం 'హీరోయిన్'. కరీనాకపూర్ ప్రధానపాత్రలో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. బాలీవుడ్ రూమర్స్ కలిపి తయారు చేసినట్లున్న ఈ కథ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కటం లేదు. ఆయన అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ కథలో ఆత్మ లేదని, సాగతీయడం తప్ప కొత్తదనం అంతకంటే లేదని విమర్శకులు చీల్చి చెండాడారు. దానికి తోడు సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. అయితే కలెక్షన్స్ బాగుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా 'డర్టీ పిక్చర్'ని కలెక్షన్స్ లో బీట్ అవుట్ చేస్తోంది.
గత సంవత్సరం సూపర్ హిట్ గా నిలిచిన విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'తరహాలో హిట్ కొడదామనుకున్న కంటెంట్ పరంగా ఈ చిత్రం 'డర్టీ పిక్చర్' దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఈ చిత్రంలో కరీనాకపూర్ మహి అరోరా గా కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ కుటుంబం, తల్లి తండ్రి ఎప్పుడూ దెబ్బలాడుకునే అశాంతి వాతావరణం నుంచి వచ్చిన ఆమె బాలీవుడ్ లో ఓ స్ధాయికి వచ్చినట్లే వచ్చి పతనమైపోతుంది. ఆమె తన కెరీర్‌లో పూర్తిగా వెనుకబడిపోతూ దాన్ని డైజస్ట్ చేసుకోలేకపోతుంది. కొత్త నీరు వచ్చి పాత నీరుని తుడిచి పెట్టుకుపోయినట్లు ఆమె కెరీర్ పరిసమాప్తమైపోతుంది. ఆమె అప్పటికీ సూపర్‌స్టార్ ఆర్యన్ ఖన్నా (అర్జున్ రాంపాల్)తో రిలేషన్ పెట్టుకున్నా ఫలితం ఉండదు. ఇలాంటి అంశాలతో వచ్చిన ఈ కథాంశం ఎవరికీ నచ్చటం లేదు.
అయితే 'హీరోయిన్' ఓవర్ సీస్ మార్కెట్లలో మాత్రం కలెక్షన్స్ బాగున్నాయంటున్నారు. బ్రిటన్‌లో నలభై ఒక్క స్క్రీన్ల లో రిలీజ్ అయిన ఈ చిత్రం 78,402 డాలర్లు రాబట్టింది. అలాగే యుఎస్‌లో 112 స్క్రీన్ల నుండి దాదాపు 140, 000 డాలర్లు ఆదాయం వచ్చింది. ఈ చిత్రం ఇం డియాలో 7.5కోట్లు సంపాదించింది. ఇటీవలి కాలంలో ఏ హీరోయిన్ ఓరెయెంటెడ్ సినిమాకూ ఇంత కలెక్షన్స్ రావడం చూడలేదని డిస్నీ, యుటివి స్టూడియోస్‌కు చెందిన అమృతాపాండే అన్నారు. ఇక ఈ చిత్రం బడ్జెట్ 20 కోట్లని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











