twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరిశ్రమలో పాపాలు, లోపాలు ఎత్తిచూపినా... (ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    క్రిందటి వారం బాలకృష్ణ 'సింహా", ఇవివి సత్యనారాయణ హాస్య చిత్రం 'బురిడి", కరిష్మా కొఠక్ ప్రధాన పాత్రలో నటించిన 'గ్లామర్" రిలీజయ్యాయి. వీటిలో 'సింహా" ఇప్పటికే సూపర్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురిపించుకుంటూ దూసుకుపోతోంది. దర్శకుడు బోయపాటి శ్రీను 'సింహా" చిత్రాన్ని కేవలం ఒక పాట మినహా హైదరాబాద్ ‌లోనే తక్కువ బడ్జెట్ ‌లో చిత్రీకరించి, చిత్రం విడుదల ముందే నిర్మాతకు టేబుల్ ప్రాపిట్ ‌ను అందివ్వడమే కాదు, బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని హ్యాట్రిక్ కొట్టడంతో పాటు బాలయ్యకు విజయాన్ని అందించాడని అంతా మెచ్చుకుంటున్నారు. ఇక బాలకృష్ణకు చాలా కాలం తర్వాత ఈ రేంజి హిట్ రావటంతో పరిశ్రమలోని పెద్ద దర్శకుల దృష్టి బాలకృష్ణపై పడింది. ఆ రకంగా సింహా దర్శకుడు, నిర్మాత, హీరో ముగ్గురికీ లాభం చేకూర్చింది.

    ఇక ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో హాస్య ప్రధానంగా వచ్చిన 'బురిడి" ఫర్వాలేదనిపించుకుంటోంది. అయితే బూతు ఎక్కువ అవటం, చిత్రం నిండా అక్రమ సంభందాలే ప్రధానంగా ఉండటం ఓ వర్గం ప్రేక్షకులను దూరం పెడుతోంది. అయితే కామిడీని ఇష్టపడేవారు చూస్తున్నారు. ఇక శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్ కరిష్మాకొఠక్ ప్రధాన పాత్రలో నటించిన 'గ్లామర్" ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయింది. అయితే సినిమా ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం నటి ప్రత్యూష మరణంపై చర్చించటం గమనార్హం. అలాగే చిత్రంలో చాలా సన్నివేశాలు సినీ పరిశ్రమను, అందులోని వ్యక్తులను విమర్శిస్తూ సాగుతాయి. పరిశ్రమలో కులాల ప్రాధాన్యతను కొన్ని చోట్ల ధైర్యంగా చిత్రీకరించాడు. అయితే తెరపై కథ చెప్పే విధానంలో తడపడటం, ఎంటర్టైన్మెంట్ లోపించటం మైనస్ గా మారి నస పెట్టాయి. ఇక అంతుకు ముందు వారం రిలీజైన ప్రభాస్ 'డార్లింగ్" ..కలెక్షన్స్ చాలా చోట్ల డ్రాప్ అయ్యాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X