మణికర్ణికకు పద్మావతి కష్టాలు.. కర్ణిసేన వార్నింగ్
యుద్ధనారి ఝాన్సీ రాణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక చిత్ర విడుదలకు అడ్డంకులు తప్పడం లేదు. పద్మావతి చిత్ర విడుదలను అడ్డుకొన్న కర్ణిసేన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.

మణికర్ణిక చిత్రంలోని సన్నివేశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. మా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయొద్దు అని కర్ణి సేన హెచ్చరించింది. కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో కంగన రనౌత్ స్పందించారు.
నలుగురు చరిత్రకారుల కథను ఆమోదించిన తర్వాతే సినిమాను తెరకెక్కించాం. అంతేకాకుండా సెన్సార్ సర్టిఫికెట్ కూడా లభించింది. ఈ నేపథ్యంలో సినిమాను అడ్డుకొని వేధించవద్దు అని కంగన పేర్కొన్నది.
ఈ చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ అవకాశం రావడంతో స్వయంగా కంగన దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది.


Click it and Unblock the Notifications











