Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
బ్లాక్ బస్టర్ హిట్‌తో వందకోట్ల మార్క్.. కెరీర్లోనే ఫస్ట్ టైమ్.. ఆనందంలో హీరో
ఏ హీరోకైనా వందకోట్ల మార్క్‌ను టచ్ చేయాలనే ఆశ ఉంటుంది. అయినా ఒకప్పుడు వంద కోట్లు కొల్లగొట్టాలంటే అది కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే సాధ్యమనే అపోహ పోయింది. కేవలం ఒక ప్రాంతీయ భాషా చిత్రం కూడా వందకోట్లను రాబట్టగలవని నిరూపిస్తున్నాయి. టాలీవుడ్లో పెద్ద సినిమాలు అవలీలగా వంద కోట్ల గ్రాస్‌ను అవలీలగా రాబట్టేస్తున్నాయి. తమిళ నాట రజినీ, విజయ్, అజిత్ సినిమాలు రెండు మూడు రోజుల్లోనే ఆ మార్క్‌ను రీచ్ అవుతున్నాయి.
ఈజీగా వందకోట్ల మార్క్
ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి లాంటి హీరోలు వంద కోట్లను దాటి రూ.200కోట్లను కొల్లగొట్టేస్తున్నారు. తెలుగులో రెండు వందల కోట్లను కూడా వసూలు చేస్తుండగా.. కోలీవుడ్‌లో ఓ ముగ్గురు హీరోలు ఆ ఫీట్‌ను అందుకున్నారు. విజయ్, అజిత్, రజినీకాంత్‌లు వసూళ్లలో దుమ్ములేపుతున్నారు.
పేట్టా, విశ్వాసంలతో..
ఈ ఏడాది సంక్రాంత్రికి విడుదలైన రజినీ పేట్టా, అజిత్ విశ్వాసం రెండు వందల కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. రీసెంట్గా విడుదలైన విజయ్ విజిల్ (బిగిల్) చిత్రం మూడు వందల కోట్ల మార్క్‌ను టచ్ చేయనుంది. ఇలా ఓ ప్రాంతీయ చిత్రాలు వసూళ్ల పరంగా కొత్త ఒరవడిని క్రియేట్ చేస్తున్నాయి.
ఫస్ట్ టైమ్ వంద కోట్ల మార్క్..
యుగానికొక్కడు చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. ఆవారా, నా పేరు శివ లాంటి కమర్షియల్ సక్సెస్‌లున్నా వంద కోట్ల మార్క్‌ను టచ్ లేకపోయాడు. తాజాగా ఖైదీ చిత్రంతో ఆ ఫీట్‌ను టచ్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. దీంతో ఆ హీరో సంబరాల్లో మునిగిపోయాడు. కెరీర్లో ఫస్ట్ టైమ్ వంద కోట్ల మార్క్‌ను చూడటంతో ఫుల్ ఖుషీ అవుతున్నాడు.
Recommended Video
విజిల్‌తో పోటీపడి మరీ..
తమిళ నాట విజయ్ సినిమాతో పోటీపడేందుకు సాధారణంగా ఏ హీరో సాహసం చేయలేడు. కానీ కంటెంట్ మీదున్న నమ్మకంతో కార్తీ దళపతిని ఢీకొట్టేశాడు. విజిల్‌ను తట్టుకుని వంద కోట్ల మార్క్‌ను రీచ్ అయింది. ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.