కార్తీ 'దొంగ' కలెక్షన్స్: బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తుంటే..
వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'దొంగ'. డిసెంబర్ 20వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా విడుదలైంది. ఇటీవలే ఖైదీ సినిమాతో సక్సెస్ అందుకున్న కార్తీ ఈ సినిమాలో హీరోగా నటించగా, జ్యోతిక, సత్యరాజ్, నిఖిల, ఆన్సన్, షావుకారు జానకి, సీత కీలక పాత్రలు పోషించారు.
ఇక విడుదలైన తొలిరోజే 'దొంగ' సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 23 లక్షల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత రెండో రోజు కూడా పెద్దగా గ్రోత్ కనిపించలేదు. రెండో రోజు దొంగ కలెక్షన్స్ చూస్తే కేవలం 20 లక్షల షేర్ మాత్రమే ఉంది. ఇక మూడో రోజు సెలవు దినం కావడంతో దొంగ కలెక్షన్స్‌లో కొద్దిగా గ్రోత్ కనిపించింది.

మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దొంగ సినిమా 26 లక్షల షేర్ వసూలు చేసిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో 3 రోజులకు గాను దొంగ 67 నుండి 69 లక్షల దాకా షేర్ వసూలు చేసింది. నాలుగో రోజు (సోమవారం) ఈ సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిసింది.
విడుదలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.5 కోట్ల బిజినెస్ చేసింది 'దొంగ'. అంటే బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఈ సినిమా 4 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా నమోదైన కలెక్షన్స్‌ని బట్టి చూస్తే 'దొంగ' బ్రేక్ ఈవెన్ దాటడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు.


Click it and Unblock the Notifications











