twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుమ్మురేపుతున్న ఖైదీ కలెక్షన్లు.. విజయ్ బిగిల్‌‌కు ధీటుగా కార్తీ వసూళ్లు

    |

    దీపావళీ కానుకగా రిలీజైన దక్షిణాది సినీ హీరో కార్తీ తాజా చిత్రం ఖైదీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ చిత్రం కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు, మలయాళ భాషల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం కార్తీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డును నెలకొల్పింది. గత మూడు రోజుల్లో ఖైదీ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..

    చెన్నైలో భారీగా

    చెన్నైలో భారీగా

    చెన్నై నగరంలో ఖైదీ చిత్రం భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఓ పక్క బిగిల్ వసూళ్ల సునామీని తట్టుకొని కూడా రికార్డు వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. చెన్నైలో శుక్రవారం ఈ చిత్రం రూ.32 లక్షలు, శనివారం రూ.37 లక్షలు, ఆదివారం రూ.38 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా చెన్నై పట్టణంలో ఈ చిత్రం రూ.1.07 కోట్లు వసూలు చేయడం విశేషం.

    కేరళలో మూడో రోజే లాభాల్లోకి

    కేరళలో మూడో రోజే లాభాల్లోకి

    కేరళలో ఖైదీ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తున్నది. శుక్రవారం ఈ చిత్రం రూ.45 లక్షలు, శనివారం రూ.50 లక్షలు, ఆదివారం రూ.61 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా చూసుకొంటే రూ.1.56 కోట్ల గ్రాస్, రూ.71 లక్షల షేర్ వసూళ్లతో కార్తీ మూవీ దూసుకెళ్తున్నది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.60 లక్షలకు అమ్ముడుపోగా.. ఇప్పటికే ఈ చిత్రం లాభాల్లోకి చేరుకొన్నది. రానున్న రోజుల్లో రికార్డు కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది.

    ఓవర్సీస్‌లో

    ఓవర్సీస్‌లో

    ఓవర్సీస్‌లో ఖైదీ చిత్రం భారీగానే కలెక్షన్లను రాబడుతున్నది. తొలి రోజున ఈ చిత్రం రూ.3.1 కోట్లు వసూలు చేయగా, రెండో రోజున రూ.6 కోట్లు వసూలు చేసింది. రెండో రోజున వసూళ్లు రెండింతలు పెరగడం ఈ సినిమా స్టామినాకు అద్దం పట్టింది. ఆదివారం కలెక్షన్లు కూడా రూ.5 కోట్లకుపైనే ఉన్నట్టు సమాచారం.

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగులో గత రెండు రోజుల్లో రూ.కోటికిపైగా కలెక్షన్లను రాబట్టింది. తొలి రోజు రూ.50 లక్షల షేర్ సాధించగా, రెండో రోజు రూ.68 లక్షలు రాబట్టింది మూడో రోజు కూడా రూ.50 లక్షకులపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో రెండు రోజుల్లో రూ.1.68 కోట్లకుపైగా షేర్‌ను సొంతం చేసుకొన్నట్టు తెలుస్తున్నది. రానున్న రోజుల్లో మరిన్నీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తున్నది.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ఖైదీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజుల్లో రూ.14 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఇక మూడో రోజు రూ.1.8 కోట్ల షేర్ అంటే దాదాపు రూ.3 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

    English summary
    Karthi's Khaidhi (Kaithi) movie doing business box office. This movie getting best numbers in Karthi's career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X