twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖైదీ ఖతర్నాక్ జోష్.. వసూళ్ల పరంగా బాక్సాఫీస్ బొనాంజా! 4 రోజుల్లోనే..

    |

    కార్తీ హీరోగా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఖైదీ' ఖతర్నాక్ జోష్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. అక్టోబర్ 25వ తేదీన విడుదలైన ఈ సినిమా విజయవంతంగా నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఖైదీ ఎంత రాబట్టిందో చూద్దామా..

    డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌.. తెలుగు, తమిళ భాషల్లో

    డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌.. తెలుగు, తమిళ భాషల్లో

    డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ' సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో ద్వారానే పాజిటివ్ టాక్ తెచ్చుకొని రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది.

    Recommended Video

    Whistle And Khaidi First Day Collections | Vijay | Karthi | Kaithi | Bigil |
     రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న ఖైదీ

    రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న ఖైదీ

    ఓ వైపు విజయ్ విజిల్, మరోవైపు కార్తీ ఖైదీ ఈ రెండు సినిమాలు పోటాపోటీగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. డిఫెరెంట్ థ్రిల్లర్ ఖైదీకి బాగా కనెక్ట్ అయ్యారు తెలుగు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే 2 కోట్ల 46 లక్షలు రాబట్టింది ఖైదీ సినిమా. కలెక్షన్స్ పరంగా రెండు తెలుగు రాష్ట్రాలను కుమ్మేస్తోంది ఖైదీ సినిమా.

    ఏయే ఏరియాలో ఎంతెంత..?

    ఏయే ఏరియాలో ఎంతెంత..?

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ ఏరియావైజ్ రిపోర్ట్ చూసినట్లయితే.. నైజాం - 76 లక్షలు, సీడెడ్ 41 లక్షలు, ఉత్తరాంధ్ర 35 లక్షలు, ఈస్ట్ గోదావరి19 లక్షలు, వెస్ట్ గోదావరి 15 లక్షలు, కృష్ణా 29 లక్షలు, నెల్లూరు 12 లక్షలు, గుంటూరు 19 లక్షలు, మొత్తంగా 2 కోట్ల 46 లక్షలు వసూలు చేసింది ఖైదీ మూవీ.

    ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో..

    ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో..

    తెలుగుతో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో.. అలాగే ఓవర్సీస్ లోనూ ఖైదీ కుమ్మేస్తోంది. చెన్నైలో రికార్డు స్థాయి వసూళ్లతో ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తున్న ఈ సినిమా.. కేరళలో మూడో రోజు ముగిసే సరికి లాభాల బాట పట్టేసింది. అటు ఓవర్సీస్ లోనూ కాసుల వర్షం కురిపిస్తోంది.

     త్వరలోనే 50 కోట్ల క్లబ్

    త్వరలోనే 50 కోట్ల క్లబ్

    దేశవిదేశాల్లో ఖైదీ జోష్ చూసిన ట్రేడ్ పండితులు అతిత్వరలో ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరిపోతుందని అంచనా వేస్తున్నారు. కార్తీ నటన, సినిమాలోని ట్విస్టులు అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం సినిమాకు బాగా ప్లస్ అయిందని తెలుస్తోంది.

    English summary
    Kollywood hero Karthi latest movie Khaidi. This movie released friday and getting possitive talk. Now this movie 4 days collection report is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X