ఖైదీ 7 రోజుల కలెక్షన్లు.. షాకింగ్‌గా కార్తీ మూవీ వసూళ్లు.. ఎంత రాబట్టిందంటే..

విభిన్నమైన కథ, కథనాలతో ప్రయోగాత్మకంగా రూపొందిన ఖైదీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. తమిళ నటుడు కార్తీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డు నమోదు చేసింది. దీపావళీ కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండోవారంలోకి ప్రవేశించింది. పాజిటివ్ పబ్లిక్ టాక్‌తో కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. గత వారం రోజుల్లో ఖైదీ సాధించిన కలెక్షన్లు ఎంతంటే..

7వ రోజున ఖైదీ

7వ రోజున ఖైదీ

తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ చిత్రం 7వ రోజున మంచి వసూళ్లను నమోదు చేసింది. నైజాంలో ఈ చిత్రం రూ.18 లక్షలు, సీడెడ్‌లో రూ.7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.14 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, గుంటూరులో రూ.3 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 4.1 లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షలు వసూలు చేసింది. తెలంగాణ, ఏపీలో 7వ రోజు రూ.53 లక్షల కలెక్షన్లు నమోదయ్యాయి.

7 రోజుల్లో మొత్తంగా ఖైదీ వసూళ్లు

7 రోజుల్లో మొత్తంగా ఖైదీ వసూళ్లు

ఇక మొత్తంగా ఏడు రోజుల కలెక్షన్లు చూసుకొంటే నైజాంలో రూ.2 కోట్లకుపైగా, సీడెడ్‌లో రూ.38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.64 లక్షలు వసూళ్లు సాధించాయి. తూర్పు గోదావరి జిల్లాలో రూ.38 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 25 లక్షలు, గుంటూరు రూ.30 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.39 లక్షలు, నెల్లూరులో రూ.21 లక్షలు వసూలయ్యాయి. ఇక మొత్తంగా వారం రోజుల్లో రూ.5 కోట్లు వసూలు చేసింది.

తమిళనాడు.. మిగితా రాష్ట్రాల్లో

తమిళనాడు.. మిగితా రాష్ట్రాల్లో

తెలుగేతర రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వసూళ్లు చూస్తే.. తమిళనాడులో రూ.25 కోట్లు, కర్ణాటకలో రూ.1.82 కోట్లు, కేరళలో రూ.3.26 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.16 కోట్లు వసూలయ్యాయి. ఇక వారం రోజుల్లో ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రెండో వారంలో కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

 ఓవర్సీస్‌లో

ఓవర్సీస్‌లో

ఇక ఓవర్సీస్ పరిస్థితి చూస్తే.. యూఎస్, కెనడా, ఇతర దేశాల్లో రూ.9.75 కోట్లు వసూలు చేసింది. దాంతో 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్.. 26 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ఈ చిత్రం ప్రవేశించింది.

 బ్రేక్ ఈవెన్ నుంచి లాభాల్లోకి

బ్రేక్ ఈవెన్ నుంచి లాభాల్లోకి

తెలుగు ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ చిత్రం బిజినెస్ రూ.4.3 కోట్లు జరిగింది. దాంతో ఈ చిత్రం రూ.5 కోట్లు లక్ష్యంగా బరిలోకి దిగి ఆ మొత్తాన్ని ఏడు రోజుల్లోనే సాధించింది. తమిళంలో రూ.24 కోట్ల బిజినెస్ జరిగితే.. 42 కోట్ల గ్రాస్ కలెక్షన్ల లక్ష్యంతో విడుదలైంది. ఇప్పటికే ఆ మొత్తానికి చేరువై డిస్టిబ్యూటర్లలో సంతోషాన్ని నింపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X