Sardar 10 Days Collections: కార్తికి కలిసొచ్చిన సండే.. 10వ రోజు అన్ని లక్షలు.. మరో 12 లక్షలు వస్తే!
తెలుగులో కూడా మార్కెట్‌ను ఏర్పరచుకున్న దక్షిణాది హీరోలు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా తమ చిత్రాలను నేరుగా మన దగ్గర కూడా విడుదల చేస్తున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ఒకడు. సుదీర్ఘ కాలంగా తెలుగు మార్కెట్‌పై ఫోకస్ చేస్తోన్న అతడు.. ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'సర్దార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు రాష్ట్రాల్లో అదిరిపోయే కలెక్షన్లతో హిట్ అందుకున్న 'సర్దార్' మూవీ.. పది రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఎంత లాభం రాబట్టింది? చూడండి!

సర్ధార్‌గా సందడి చేస్తోన్న కార్తి
తమిళంలోని హీరో కార్తి హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'సర్దార్'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రజీషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేశారు. అలాగే, చుంకీ పాండే, లైలా కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ తమిళం, తెలుగులోనూ రిలీజ్ అయింది.

సర్దార్ ప్రీ బిజినెస్ వివరాలు
కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా కార్తికి ఆంధ్రా, తెలంగాణలో కూడా మార్కెట్ బాగానే ఉంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'సర్ధార్'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే దీన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

10వ రోజు తెలుగు వసూళ్లిలా
టాలెంటెడ్ హీరో కార్తి నటించిన 'సర్ధార్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఈ చిత్రం టార్గెట్‌ను కూడా చేరుకుంది. ఇదే జోరును కొనసాగిస్తూ వసూళ్లను మంచిగా రాబడుతోంది. ఈ క్రమంలోనే 10వ రోజు ఈ సినిమాకు రూ. 37 లక్షలు షేర్ వసూలు అయింది.

10 రోజులకు కలిపి కలెక్షన్లు
10 రోజుల్లో అంధ్రప్రదేశ్, తెలంగాణలో 'కార్తి' మూవీ మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 2.88 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 86 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.14 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ మూవీ రూ. 6.88 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

టార్గెట్ ఎంత? లాభం ఎంత
కార్తి నటించిన 'సర్ధార్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5.0 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, పది రోజుల్లో ఈ సినిమాకు రూ. 6.88 కోట్లు వచ్చాయి. అంటే.. ఈ మూవీ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.38 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో కార్తి 'సర్దార్' మూవీ రూ. 11.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అలాగే, తమిళనాడులో ఇది రూ. 38.55 కోట్లు, కర్నాటకలో రూ. 2.05 కోట్లు, కేరళలో రూ. 1.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.20 కోట్లు గ్రాస్, రూ. 33.75 కోట్ల షేర్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











