Sardar 11 Days Collections: తెలుగులో ‘సర్ధార్’ రికార్డు.. ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే మాత్రం!
పేరుకు కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా తెలుగులోనూ మార్కెట్‌ను ఏర్పరచుకుని రెండు భాషల్లోనూ సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ హీరో కార్తి. తన ప్రతి సినిమానూ ఇక్కడ కూడా విడుదల చేస్తూ మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే పలు విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కార్తి 'సర్దార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి తెలుగులో అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా ఇది ఇక్కడ విజయం అందుకుంది. ఈ నేపథ్యం 'సర్దార్' పది రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

సర్ధార్‌గా ఎంట్రీ ఇచ్చిన కార్తి
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి.. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'సర్దార్'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రజీషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేశారు. అలాగే, చుంకీ పాండే, లైలా కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ తమిళం, తెలుగులోనూ విడుదలైంది.

సర్దార్ ప్రీ బిజినెస్ వివరాలు
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా కార్తికి ఆంధ్రా, తెలంగాణలో కూడా మార్కెట్ బాగానే ఉంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'సర్ధార్'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ అయింది. దీంతో దీన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేసుకున్నారు.

11వ రోజు తెలుగు వసూళ్లిలా
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కార్తి నటించిన 'సర్ధార్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఈ చిత్రం టార్గెట్‌ను కూడా చేరుకుంది. ఇదే జోరును కొనసాగిస్తూ వసూళ్లను మంచిగా రాబడుతోంది. ఈ క్రమంలోనే 11వ రోజు ఈ సినిమాకు రూ. 18 లక్షలు షేర్ రాబట్టింది.

11 రోజులకు కలిపి కలెక్షన్లు
అంధ్రప్రదేశ్, తెలంగాణలో 'కార్తి' మూవీ 11 రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 2.94 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 88 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.24 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ మూవీ రూ. 7.06 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.85 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

టార్గెట్ ఎంత? లాభం ఎంత
కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన 'సర్ధార్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5.0 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 7.06 కోట్లు వచ్చాయి. అంటే.. ఈ మూవీ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.56 కోట్లు లాభాలతో రికార్డు సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు
11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కార్తి 'సర్దార్' మూవీ రూ. 11.85 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అలాగే, తమిళనాడులో ఇది రూ. 40.15 కోట్లు, కర్నాటకలో రూ. 3.10 కోట్లు, కేరళలో రూ. 1.38 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18.85 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 76.58 కోట్లు గ్రాస్, రూ. 38.60 కోట్ల షేర్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











