Sardar Collections: వరల్డ్ వైడ్ గా కార్తి 'సర్దార్' రచ్చ.. 12 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

కార్తి.. పేరుకు తమిళ హీరో అయిన తెలుగువాడిలానే భావిస్తారు టాలీవుడ్ ప్రేక్షకులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కార్తి.. తనదైన నటనతో అనేక అభిమానులను సంపాందించుకున్నాడు. మల్లిగాడు, యుగానికి ఒక్కడు, ఖైదీ సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల సర్దార్ గా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 21న వచ్చాడా కార్తి. రజీషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కార్తి నటించిన 'సర్దార్' 12 రోజుల్లో ఎంత రాబట్టిందనే వివరాళ్లోకి వెళితే..

 ద్విభాషా చిత్రంగా..

ద్విభాషా చిత్రంగా..

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి.. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రజీషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా అలరించారు. అలాగే, చుంకీ పాండే, లైలా కీలక పాత్రలను పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా ద్విభాషా చిత్రంగా తమిళం, తెలుగులోనూ విడుదలైంది.

 ప్రీ బిజినెస్ వివరాలు..

ప్రీ బిజినెస్ వివరాలు..

తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా కార్తీకి ఆంధ్రా, తెలంగాణలో కూడా మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు కార్తి తాజాగా నటించిన 'సర్ధార్' చిత్రంపై ప్రారంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.00 కోట్లు వరకు బిజినెస్ అయింది. అందుకే తెలుగులోనూ చాలా గ్రాండ్‌గా విడుదల చేశారు.

ఏపీ తెలంగాణలో 12వ రోజు వసూళ్లు..

ఏపీ తెలంగాణలో 12వ రోజు వసూళ్లు..

తనదైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కార్తి తాజా సినిమా 'సర్ధార్' కి ప్రారంభం నుంచే మంచి మౌత్ టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఈ చిత్రం టార్గెట్‌ను కూడా చేరుకుంది. ఇదే జోరును కొనసాగిస్తూ వసూళ్లను మంచిగా రాబడుతోంది. ఈ క్రమంలోనే 12వ రోజు సర్దార్ సినిమాకు రూ. 12 లక్షలు షేర్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల కలెక్షన్లు..

తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల కలెక్షన్లు..

అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'కార్తి' చిత్రం 12 రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 3 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 89 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.29 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ. 7.18 కోట్లు షేర్‌తో పాటు రూ. 12.05 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

టార్గెట్ పోగా వచ్చిన లాభం ఎంతంటే..

టార్గెట్ పోగా వచ్చిన లాభం ఎంతంటే..

కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన 'సర్ధార్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5.0 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 7.18 కోట్లు వచ్చాయి. అంటే.. ఈ మూవీ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.68 కోట్లు లాభాలతో రికార్డు సాధించింది.

 వరల్డ్ వైడ్ వసూళ్లు..

వరల్డ్ వైడ్ వసూళ్లు..

కార్తి 'సర్దార్' మూవీకి 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.05 కోట్లు గ్రాస్‌ వచ్చింది. అలాగే, తమిళనాడులో ఇది రూ. 41.20 కోట్లు, కర్నాటకలో రూ. 3.20 కోట్లు, కేరళలో రూ. 1.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 19.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 78.35 కోట్లు గ్రాస్‌, రూ. 39.50 కోట్ల షేర్ రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X