Sardar 9 Days Collections: తెలుగులో కార్తి సెన్సేషనల్ రికార్డు.. సర్ధార్ 9 రోజుల వసూళ్లు చూశారంటే!
కోలీవుడ్‌కు చెందిన కొంత మంది హీరోలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందులో సూర్య సోదరుడిగా పరిచయమై.. కోలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌గా వెలుగొందుతోన్న కార్తి ఒకడు. అన్న కంటే ఆలస్యంగానే సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ... మంచి మంచి సినిమాలతో అతడి కంటే ముందే టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. అందుకు అనుగుణంగానే ప్రతి సినిమానూ ఇక్కడ విడుదల చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సర్ధార్' అనే సినిమాతో వచ్చాడు. తెలుగులో సత్తా చాటుతోన్న ఈ మూవీ 9 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

సర్ధార్‌గా ఎంటర్ అయిన కార్తి
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'సర్దార్'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రజీషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేశారు. అలాగే, చుంకీ పాండే, లైలా కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది.

సర్దార్ ప్రీ బిజినెస్ వివరాలు
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కార్తి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'సర్ధార్'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే దీన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

9వ రోజు తెలుగు వసూళ్లిలా
కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన 'సర్ధార్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుంది. ఇదే జోరును కొనసాగిస్తూ వసూళ్లను మంచిగా రాబడుతోంది. ఈ క్రమంలోనే 9వ రోజు ఈ సినిమాకు రూ. 22 లక్షలు షేర్ వసూలు అయింది.

9 రోజులకు కలిపి కలెక్షన్లు
అంధ్రప్రదేశ్, తెలంగాణలో 'కార్తి' మూవీ 9 రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 2.76 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 82 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 2.93 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ మూవీ రూ. 6.51 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.90 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

టార్గెట్ ఎంత? లాభం ఎంత
కార్తి నటించిన 'సర్ధార్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.0 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు రూ. 6.51 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.01 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు
9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కార్తి 'సర్దార్' మూవీ రూ. 10.90 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అలాగే, తమిళనాడులో ఇది రూ. 36.30 కోట్లు, కర్నాటకలో రూ. 1.95 కోట్లు, కేరళలో రూ. 1.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.45 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 64 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 32.20 కోట్ల షేర్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











