Japan 2 Days Collections: 2వ రోజే ఢమాల్.. కార్తికి మామూలు షాక్ కాదుగా.. 40 కోట్ల మూవీకి ఈ వసూళ్లా?

సూర్య తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరించి స్టార్‌గా ఎదిగిపోయాడు కార్తి. మొదట్లో తమిళ ఆడియెన్స్‌కు దగ్గరైన అతడు.. ఆ తర్వాత తెలుగులోనూ ప్రభావాన్ని చూపించాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ కోలీవుడ్ స్టార్ 'జపాన్' అనే ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటించాడు. దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ పెద్దగా రావట్లేదు. ఫలితంగా కలెక్షన్లు డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కార్తి 'జపాన్' మూవీ రెండు రోజుల వసూళ్లను మీరే చూడండి!

Karthi Starrer Japan Movie 2 Days Box Office Collections

జపాన్‌గా కార్తి మరో ప్రయోగం: కోలీవుడ్ స్టార్ కార్తి - రాజు మురుగణ్ కాంబినేషన్‌లో రూపొందిన ఫన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'జపాన్'. ఈ క్రేజీ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటించగా.. సునీల్ కీలక పాత్రను పోషించాడు. ఈ క్రేజీ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు.

జపాన్ మూవీ బిజినెస్ ఇలా: వైవిధ్యమైన కథాంశంతో కామెడీ జోనర్‌లో రూపొందిన 'జపాన్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 34 కోట్లు బిజినెస్ అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 40 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.

Karthi Starrer Japan Movie 2 Days Box Office Collections

2వ రోజు తెలుగు వసూళ్లు: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'జపాన్' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ పెద్దగా రావట్లేదు. ముఖ్యంగా రెండో రోజే ఇది దారుణంగా డౌన్ అయింది. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రెండో రోజు రూ. 38 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

2 రోజులకూ కలిపి ఎంత?: కార్తి నటించిన 'జపాన్' మూవీకి తెలుగులో దారుణమైన రెస్పాన్స్ వస్తోంది. తక్కువ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు అతి దారుణంగా పడిపోయింది. ఫలితంగా దీనికి చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఇలా రెండు రోజుల్లో 'జపాన్' మూవీ నైజాంలో రూ. 62 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 94 లక్షలతో కలిపి రూ. 1.56 కోట్లు షేర్, రూ. 2.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Karthi Starrer Japan Movie 2 Days Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జపాన్' మూవీకి రెండు రోజుల్లో తమిళనాడులో రూ. 4.95 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.70 కోట్లు, కర్నాటకలో రూ. 75 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.00 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 10.30 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.45 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: కార్తి నటించిన 'జపాన్' మూవీ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లు బిజినెస్ చేయగా.. 2 రోజుల్లో రూ. 5.45 కోట్లు రాబట్టింది. అంటే 41 కోట్లు టార్గెట్‌కు ఇంకా రూ. 35.55 కోట్లు వెనుకబడి ఉంది. తెలుగులో ఈ చిత్రానికి రూ. 6 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 6.50 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీకి ఇంకా రూ. 4.94 కోట్లు వసూలు కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X