Japan 3 Days Collections: పండుగ రోజు షాక్.. 3 రోజుల్లో వచ్చింది ఇంతే.. ఎన్ని కోట్లు రావాలో తెలిస్తే!
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ సౌతిండియా మొత్తంలో ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతోన్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కార్తి 'జపాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విభిన్నమైన కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆశించిన రీతిలో రాణించడం లేదు. ఫలితంగా వసూళ్లు నిరాశపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్తి 'జపాన్' మూవీ మూడు రోజుల వసూళ్లను మీరే చూడండి!
జపాన్‌గా కార్తి నటవిశ్వరూపం:కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా నటించిన తాజా చిత్రమే 'జపాన్'. రాజు మురుగణ్ తెరకెక్కించిన ఈ క్రేజీ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటించగా.. సునీల్ కీలక పాత్రను పోషించాడు. ఈ క్రేజీ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.

జపాన్ మూవీ బిజినెస్ ఇలా:క్రేజీ కాన్సెప్టుతో కామెడీ జోనర్‌లో రూపొందిన 'జపాన్' మూవీ ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఫలితంగా ఈ సినిమా రైట్స్‌కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 34 కోట్లు బిజినెస్ అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 40 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిపింది.
3వ రోజు తెలుగు వసూళ్లు:ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జపాన్' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ రావడంతో స్పందన పెద్దగా రావట్లేదు. ముఖ్యంగా హాలీడే ఉన్నా సత్తా చాటలేదు. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 3వ రోజు రూ. 40 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.
3 రోజులకూ కలిపి ఎంత?:కార్తి నటించిన 'జపాన్' మూవీకి తెలుగులో నిరాశ పరుస్తూనే వస్తోంది. ఫస్డ్ డే దారుణమైన ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం.. సెలవు రోజుల్లోనూ కూడా డల్ అయింది. ఫలితంగా దీనికి చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఇలా మూడు రోజుల్లో 'జపాన్' మూవీ నైజాంలో రూ. 82 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.14 కోట్లతో కలిపి రూ. 1.96 కోట్లు షేర్, రూ. 3.65 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'జపాన్' మూవీకి మూడు రోజుల్లో తమిళనాడులో రూ. 7.60 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.65 కోట్లు, కర్నాటకలో రూ. 95 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 15.10 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 7.85 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:కార్తి నటించిన 'జపాన్' మూవీ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లు బిజినెస్ చేయగా.. 3 రోజుల్లో రూ. 7.85 కోట్లు రాబట్టింది. అంటే 41 కోట్లు టార్గెట్‌కు ఇంకా రూ. 33.15 కోట్లు వెనుకబడి ఉంది. తెలుగులో ఈ చిత్రానికి రూ. 6 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 6.50 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీకి ఇంకా రూ. 4.54 కోట్లు వసూలు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











